నూతన కలెక్టరేట్ సుందరీకరణ కు ఆకర్షణీయమైన మొక్కలు పెంచాలి…..జిల్లా కలెక్టర్ కె. శశాంక

నూతన కలెక్టరేట్ సుందరీకరణ కు ఆకర్షణీయమైన మొక్కలు పెంచాలి…..జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం

నూతన కలెక్టరేట్ సుందరీకరణ కు ఆకర్షణీయమైన మొక్కలు పెంచాలి…..జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, జూన్ -03:

నూతన కలెక్టరేట్ లో సుందరీకరణ ఆకర్షణీయమైన మొక్కలు పెంచాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ భవన సముదాయంలో ఆకర్షణీయమైన మొక్కలు పెంచి సుందరీకరణ కు చేపట్టవలసిన పనులపై జిల్లా కలెక్టర్ కె. శశాంక డి.ఎఫ్. ఓ. రవి కిరణ్ తో కలిసి కమిటీ అధికారులతో నూతన కలెక్టరేట్ ఆవరణలో సమీక్షించారు.

ప్లాంటేషన్ ద్వారా సుందరీకరణ చేపట్టాలని, డెకరేటివ్ మొక్కలు పెంచాలనీ, ప్లాంటేషన్ కు స్ప్రింక్లర్ లు ఏర్పాటు, ఔట్ లెట్ లు సరి చూసుకోవాలని, మొక్కలకు నీటి సరఫరా నిమిత్తం వాటరింగ్ చేసే విధంగా ఉన్న బోర్ కు మోటార్ అమర్చడం తో పాటు, నీటి కొరత ఏర్పడకుండా అదనంగా బోర్ వేసి వాటేరింగ్ చేసే విధంగా చూడాలని, మిగిలిన పనులు పూర్తి చేసే విధంగా పర్యవేక్షణ చేయాలని కమిటీ అధికారులను తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, డి.ఆర్.డి. ఓ. సన్యాసయ్య, డి.హెచ్.ఎస్. ఓ. సూర్య నారాయణ, ఆర్ అండ్ బి – ఈ. ఈ. తానేశ్వర్, మునిసిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, ఎస్.ఈ. ఎన్.పి.డి.సి.ఎల్. నరేష్, డి.ఈ. రాజేంద్ర, అటవీ శాఖ అధికారులు, కాంట్రాక్టర్ కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post