నూతన కలెక్టర్ కార్యాలయ భవన సముదాయ పనులను వేగవంతం చేయాలి…

నూతన కలెక్టర్ కార్యాలయ భవన సముదాయ పనులను వేగవంతం చేయాలి…

ప్రచురణార్థం

నూతన కలెక్టర్ కార్యాలయ భవన సముదాయ పనులను వేగవంతం చేయాలి…

మహబూబాబాద్ జనవరి 3.

నూతన కలెక్టర్ కార్యాలయ భవన సముదాయ పనులను వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రం లోని కురవి రోడ్డు లో నిర్మిస్తున్న నూతన కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణం పనులకు జిల్లా కలెక్టర్ సందర్శించి పనులను పర్యవేక్షించారు.

ముందుగా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయం నిర్మాణ పనులపై మ్యాప్ను ఇంజనీరింగ్ అధికారులతో పరిశీలిస్తూ పనుల ను అడిగి తెలుసుకున్నారు.

ఇప్పటి వరకు చేపట్టిన పనుల వివరాలు ఇకపై చేపట్టే పనుల వివరాలు నివేదిక ఇవ్వాలన్నారు అనంతరం రోడ్లు భవనాలు శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ కార్యాలయం భవన సముదాయం నిర్మాణ పనులను సందర్శించి పర్యవేక్షించారు.

Nic వీడియో కాన్ఫరెన్స్ హాల్ లలో చేపడుతున్న పనులను ఆడియో విజువల్ ఇంజనీర్ ని అడిగి తెలుసుకున్నారు.

విద్యుత్తు, త్రాగునీరు, లాన్ నిర్మాణం, ప్లాంటేషన్, ప్రధాన రహదారి సంపు నిర్మాణం వంటివి పటిష్టంగా చేపట్టాలన్నారు.

కార్యాలయ ఆవరణ ప్రహరీ గోడ నిర్మాణం పనులను ఇంజనీరింగ్ అధికారులతో సందర్శిస్తూ అడిగి తెలుసుకున్నారు హెలిప్యాడ్ నిర్మాణం కొరకు చర్యలు తీసుకోవాలన్నారు.

కలెక్టర్ వెంట రోడ్లు భవనాల కార్యనిర్వాహక శాఖ అధికారి తానే శ్వర్ డిప్యూటీ డి ఈ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు
———————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post