నూతన జిల్లా కలెక్టరేట్ సముదాయాన్ని పరిశీలించిన కలెక్టర్ అమోయ్ కుమార్.

నూతన జిల్లా కలెక్టరేట్ సముదాయాన్ని పరిశీలించిన కలెక్టర్ అమోయ్ కుమార్. రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు.

శుక్రవారం ఇబ్రహీపట్నం మండలం కోంగర కాలాన్ లో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ సముదాయము(ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్)ను కలెక్టర్ అమోయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నూతన కలెక్టరేట్ ఆవరణతో పాటు నూతన భవనంలో పనులు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన సముదాయంలో అన్ని జిల్లా కార్యాలయాలు ఇక్కడే ఉండనున్న నేపథ్యంలో ఉద్యోగులకు, ఆయా పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలన్నీ కల్పించాలని కలెక్టర్ సూచించారు. హెలిప్యాడ్ పనులు, సోలార్ సిస్టం ఏర్పాటు చేయాలనీ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోలార్ సిస్టం ఏర్పాటు ద్వారా విద్యుత్తు వినియోగించుకోవడానికి వీలవుతుందని కలెక్టర్ తెలిపారు
అలాగే కలెక్టరేట్లోని అన్ని భవన సముదాయాలను కలియదిరిగి కలెక్టరేట్ ఆవరణలో అన్ని రకాల పూల మొక్కలతో పాటు నీడనిచ్చే మొక్కలను నాటాలని జిల్లా అటవీ శాఖ అధికారి (డీఎఫ్వో) జానకిరామ్ ను ఆదేశించారు. అలాగే కలెక్టరేట్ ఆవరణలో ఇంటర్నెట్ వ్యవస్థను కూడా అందుబాటులో ఉండేలా చేస్తున్నందున అందుకు అవసరమైన రిక్వర్మెంట్లు ఏర్పాటు చేయాలన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జిల్లా అదనపు ప్రతీక్ జైన్, జిల్లా అటవీ శాఖ అధికారి జానకిరామ్, ఆర్డీఓ వెంకటాచారి, ఆదిభట్ల మునిసిపల్ కమీషనర్ అమరేందర్ రెడ్డి, పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్ రెడ్డి,ఆర్ అండ్ బీ ఈఈ శ్రవణ్ ప్రకాష్, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.

 

Share This Post