నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణాల పనుల తనిఖీ : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
2:12 2021
వనపర్తి

నూతనంగా నిర్మిస్తున్న జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయ పనులు జాప్యం చేయరాదని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష కాంట్రాక్టర్లను, అధికారులను హెచ్చరించారు.

గురువారం నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణాలను కలెక్టర్ తనిఖీ చేసి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ పనులు వేగవంతం చేసి పూర్తి చేసేలా కాంట్రాక్టర్లు, అధికారులు తగు చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రణాళికాబద్ధంగా కార్యాలయం ముందు పార్కింగ్, రోడ్డు, ఇతర వసతులు కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  హార్టికల్చర్ అధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

……….
జిల్లా పౌరసంబంధాల అధికారి వనపర్తి జారీ చేయబడినది.

Share This Post