నూతన జిల్లా కోర్టు సముదాయాన్ని పరీశీలించిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

నూతన జిల్లా కోర్టు సముదాయాన్ని పరీశీలించిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

*ప్రచురణార్థం*

జయశంకర్ భూపాలపల్లి, మే 14:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శనివారం వరంగల్ ప్రిన్సిపాల్ జడ్జ్ నరసింహారావు, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ సురేందర్ రెడ్డిలతో కలిసి, భూపాలపల్లి తహశీల్దార్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన నూతన జిల్లా కోర్టు సముదాయాన్ని పరిశీలించారు. నూతన కోర్టులోని సౌకర్యాలను, అన్ని రకాల వసతులను వారు పరిశీలించారు. జిల్లా కోర్టు జూన్ 2 న ప్రారంభించనున్నట్లు వారు తెలిపారు. జిల్లాలో కోర్టు ఏర్పాటుతో అన్ని రకాల న్యాయస్థానాలు ఇక్కడే ప్రారంభo కానున్నట్లు,ఇకపై జిల్లా ప్రజలు మంథని, పరకాల, హనుమకొండలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని, ప్రజలకు న్యాయ సేవలు చేరువ కానున్నట్లు వారు అన్నారు.
———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, జయశంకర్ భూపాలపల్లి కార్యాలయంచే జారిచేయనైనది.

Share This Post