నూతన మద్యం దుకాణాల ఏర్పాటుకు మంగళవారం నుంచి దరఖాస్తు స్వీకరించనున్న నేపథ్యంలో సోమవారం కలెక్టర్‌ శర్మన్‌ సమక్షంలో హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని మొత్తం 179 దుకాణాలకు గాను కలెక్టరేట్‌లో నిర్వహించిన డ్రా పద్దతిలో ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌ కేటగిరిలకు 24 రిజర్వడ్‌ చేసి మిగిలిన 155 దుకాణాలను ఓపన్‌ కేటగిరికి కేటాయించారు.

హైదరాబాద్‌ అబ్కారి జిల్లాలో మొత్తం 80 దుకాణాలకు గాను గౌడ్‌ కేటగిగి 5, ఎస్సీ కేటాగికి 4, ఎస్టీ కేటగిరి 1 కేటాయించారు. మిగితా 70 దుకాణాలను ఓపెన్‌ కేటగిరిలో ఉంచారు. అదేవిధంగా సికింద్రాబాద్‌ జిల్లాలో మొతతం 99 దుకాణాలకు గాను గౌడ్‌ విభాగానికి 6, ఎస్సీ విభాగానికి 7, ఎస్టీ విభాగానికి 1 రిజర్వడ్‌ చేయగా, మిగితా 85 దుకాణాలను ఓపెన్‌ కేటాగిరికి కేటాయించారు.

Share This Post