జిల్లాలో 2021-28 సంవత్సరానికి సంబంధించి మద్యం దుకాణాల నిర్వహణ కొరకు చేసుకున్న దరఖాస్తుల నుండి డ్రా పద్దతిన నిర్వాహకులను ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆదివాసి భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్ది, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి లతో కలిసి లాటరీ విధానం ద్వారా నిర్వాహకులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెండు సంవత్సరాల ఒప్పందం మీద మద్యం దుకాణాలు కేటాయించడం జరుగుతుందని, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నియమ, నిబంధనలకు లోబడి నిర్వహించవలసి ఉంటుందని తెలిపారు. లక్కీ డ్రా ద్వారా జిల్లాలో 32 దుకాణాలు కేటాయించడం జరిగిందని, ఇందు కోసం 643 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. గెజిట్ నెంబర్ షాప్ 1 ఎకరాల సంతోష్, షాప్ నం.2 కొలిపాక చంద్రశేఖర్, షాప్ నం.3 దాసరి నరేష్, షాప్ నం.4 రమేష్‌బాబు, షాప్ నం.5 యాదగిరి గౌడ్, షాప్ నం. 6 రమేష్, షాప్ నం.7 ప్రహ్లాద్, షాప్ నం.8 శీకాంత్, షాప్ నం.9 కేసరి శ్రీనివాస్ గౌడ్, షాప్ నం.10 జగదీశ్వర్ రెడ్డి, షాప్ నం.11 ఇందూరి రవీందర్, షాప్ నం. 12 రాకేష్, షాప్ నం. 13 రాజేందర్, షాప్ నం. 14 ఆకుల భాస్కర్, షాప్ నం. 15 కంభంపాటి సతీష్ కుమార్, షాప్ నం. 16 నాగభూషణం, షాప్ నం.17 సంతోష్ గౌడ్, షాప్ నం.18 శేషు, షాప్ నం.19 శంకర్, షాప్ నం.20 పవన్ కుమార్, షాప్ నం.21 తుడూరి సాయికృష్ణ, షాప్ నం.22 సోమేష్, షాప్ నం.23 అశోక్, షాప్ నం.24 గండ్ల మల్లేష్, షాప్ నం.25 ఎం.విట్టల్, షాప్ నం.26 దాడి ప్రశాంత్, షాప్ నం.27 నాయికిని నారయణ, షాప్ నం. 28 వినయ్ యాద, షాప్ నం. 29 రవీందర్, షాప్ నం. 30 పెందుర్ లచ్చు దక్కించుకున్నారు. ఏజెన్సీ పరిధిలోని గెజిట్ నం. 31, 32 లకు కేవలం రెండేసి చొప్పున దరఖాస్తులు రావడంతో ఎక్సైజ్ శాఖ రాష్ట్ర కమీషనర్ ఆదేశాల మేరకు వాటిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రెండు షాపులపై నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డి.ఎస్.పి. శ్రీనివాస్, ఎక్సైజ్ సి.ఐ.లు, పోలీస్ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.