నూతన సంవత్సరం ప్రతి ఒక్కరిలో ఆనందం నింపాలి

ప్రచురణార్థం

నూతన సంవత్సరం ప్రతి ఒక్కరిలో ఆనందం నింపాలి…

మహబూబాబాద్ జనవరి. 1

నూతన సంవత్సరం ప్రతి ఒక్కరిలో ఆనందం నింపాలని వారి కుటుంబసభ్యుల్లో సంతోషం వెల్లివిరియాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆకాంక్షించారు.

శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను కలెక్టర్ కేకును కట్ చేసి ఉద్యోగులకు అందజేశారు.

అనంతరం ఉద్యోగులందరూ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు . టీఎస్ యుటిఎఫ్ ప్రతినిధులు కలెక్టర్ చేతుల మీదుగా డైరీలను క్యాలెండర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అదనపు కలెక్టర్ కొమరయ్య తొర్రూర్ ఆర్డిఓ రమేష్ జిల్లా అధికారులు తో కలిసి సమావేశమయ్యారు నూతన సంవత్సర సందర్భంగా జిల్లా అధికారులు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని జీవితాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికబద్ధంగా కొనసాగాలని అన్నారు.
జిల్లా ప్రగతిలో సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

బాలల పరిరక్షణ కమిటీ చైర్మన్ నాగవాణి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావులు నూతన సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

…………………………………………………………………….

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post