నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంను పరిశీలించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
02.10.2021.
వనపర్తి

నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అన్ని వసతులు సౌకర్యాలు త్వరితగతిన ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు. శనివారం వనపర్తి పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా కలెక్టర్ కార్యాలయం కలెక్టర్ సందర్శించారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో అన్ని వసతులు పూర్తి చేసి లాన్ లో అందమైన మొక్కలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయ లోని అన్ని విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, అంకిత్, ఈ ఈ దేశ నాయక్, హార్టికల్చర్ అధికారి సురేష్ ,రూప, రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

…. జిల్లా పౌరసంబంధాల అధికారి వనపర్తి జారీ చేయడమైనది.

Share This Post