నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన తేది:17 8 2021
వనపర్తి.

అన్ని హంగులతో ఏర్పాటు చేసిన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం మరో పది, పదిహేను రోజుల్లో గౌ. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చేతుల మీదుగా ప్రారంభం కానున్నదని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు.
మంగళవారం నూతన కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రూ. 51.7 కోట్ల నిధులతో నిర్మించిన కలెక్టర్ కార్యాలయ సముదాయంలో అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు, త్వరలో పనులు పూర్తవుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపినట్లు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమయ్యే జిల్లా కలెక్టర్ కార్యాలయం భవనంలో చిన్నచిన్న పనులు పూర్తి కావలసి ఉన్నాయని, త్వరగా పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, (లోకల్ బాడీ) అంకిత్, డి.ఎఫ్.ఓ. రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి నుండి జారి చేయనైనది.

Share This Post