నూతన సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమ వివరాలను వెల్లడించిన కలెక్టర్ హరీశ్

పత్రిక ప్రకటన–4 తేదీ : 16–08–2022
===========================================
నేడు (బుధవారం)మేడ్చల్ – మల్కాజిగిరి నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రారంభోత్సవం
నూతన సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు
రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమ వివరాలను వెల్లడించిన కలెక్టర్ హరీశ్
మేడ్చల్ – మల్కాజిగిరి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రారంభించనున్నారని జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యక్రమ వివరాలను ఆయన వివరిస్తూ. మధ్యాహ్నం 2.55 గంటలకు షామీర్పేటలోని అంతాయిపల్లి వద్ద నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాలన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రారంభిస్తారని అటు తర్వాత 3.55 గంటలకు స్థానిక ఐడీవోసీ పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారని కలెక్టర్ తెలిపారు. అనంతరం సాయంత్రం 5 గంటల వరకు సభ కొనసాగుతుందని కలెక్టర్ హరీశ్ వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ప్రజలు హాజరు కావాలని కలెక్టర్ హరీశ్ కోరారు.

Share This Post