నూతన సాంకేతికత వినియోగించుకొని గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం చేపట్టాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

 

భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 70 సంవత్సరాలు దాటిన సందర్భంలో ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకం ద్వారా పల్లెలు, కుగ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించడంతో మెరుగైన సేవల అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ భవన సమావేశ మందిరంలో భారత్‌ కి అజాదికా అమృత్‌ మహోత్సవంలో భాగంగా పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ద్వారా ఏర్పాటు చేసిన సెమినార్‌లో శాసనమండలి సభ్యులు పురాణం సతీష్క్‌ మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావు, పంచాయతీరాజ్‌ ఈ. ఈ. ప్రకాష్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు నిర్మాణం చేపట్టి రవాణా సౌకర్యం కల్పించడం ద్వారా గ్రామాల అభివృద్ధి శరవేగంగా జరుగడంతో పాటు గ్రామాల మధ్య సత్సంబంధాల అభివృద్ధి జరుగుతుందని,
ఇంజనీర్లు ఏ శాఖ వారైన నూతన సాంకేతికతను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ గ్రామీణ ప్రాంతాలలో లభించే వనరులను వినియోగించుకొని త్వరగా రోడ్డు నిర్మాణ పనులు చేసేందుకు ఇలాంటి సెమినార్‌ల ఆవశ్యకత ఉందని తెలిపారు. సాధ్యమైనంత మేర సాంకేతికతను ఉపయోగించుకొని గ్రామీణ ప్రాంతాలను మండలాలు, జిల్లా కేంద్రాలకు అనుసంధానించేలా అధికారులు చొరవ చూపాలని తెలిపారు. 2000 సంవత్సరంలో మాజీ ప్రధానమంత్రి దివంగత అటల్‌ బిహారీ వాజ్‌పేజీ ప్రధానమంత్రి సడక్‌ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారని, గ్రామీణ ప్రాంతాలను కలుపుకొని రోడ్లు, కల్వర్దులు, వంతెనలు ఏర్పాటుతో పాటు గిరిజన, వెనుకబడిన ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ పథకం క్రింద ఫేజ్‌-1లో 201 కోట్ల రూపాయల వ్యయంతో 80 పనులు చేపట్టడం జరిగిందని, పఫేజ్‌-2లో 58 కోట్ల 62 లక్షల రూపాయల వ్యయంతో 12 పనులు, ఫేజ్‌-8లో బ్యాచ్‌-1లో 21 కోట్ల 21 లక్షల రూపాయల వ్యయంతో “7 పనులు, బ్యాచ్‌-2లో 42 కోట్ల 39 లక్షల రూపాయల వ్యయంతో 15 పనులు చేపట్టి పురోగతిలో ఉన్నాయని తెలిపారు. రహదారుల అభివృద్ధిలో ఇంజనీరింగ్‌ అధికారులు, గుత్తేదారుల పాత్ర కీలకమైనదని, నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్‌, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ సత్యనారాయణ, పంచాయతీరాజ్‌ డి. ఈ.లు, ఏ. ఈ.లు, గుత్తేదారులు, జెడ్‌.పి.టి.సి.లు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post