నూరుశాతం వ్యాక్సినేషన్ పూర్తయిన గ్రామాలను ప్రకటిస్తూ స్టిక్కరింగ్ వేయాలి…

ప్రచురణార్థం

నూరుశాతం వ్యాక్సినేషన్ పూర్తయిన గ్రామాలను ప్రకటిస్తూ స్టిక్కరింగ్ వేయాలి…

మంగళవారం నెల్లికుదురు మండలం లోని శ్రీరామగిరి గ్రామంలో కలెక్టర్ పర్యటించి సబ్ సెంటర్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూరుశాతం వ్యాక్సినేషన్ అయినా గ్రామాలకు స్టిక్కరింగ్ వేయాలన్నారు

అదేవిధంగా
వ్యాక్సినేషన్ వేయించుకున్న రామగిరి రాములు రామగిరి ఉప్పలయ్య ఇండ్లకు జిల్లా కలెక్టర్ శశాంక వైద్యాధికారి హరీష్ రాజుతో వెళ్లి వ్యాక్సినేషన్ కార్యక్రమం పై అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు.

రామగిరి ఉప్పలయ్య మాట్లాడుతూ తమ కుమారుడు ఆర్మీలో పని చేస్తాడని తమ కుమారుడే వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రోత్సహించారని కలెక్టర్కు వివరించగా మీ కుమారుడు ఎక్కడ పని చేస్తున్నారని ప్రశ్నించారు.

తమ కుమారుడు ప్రస్తుతం చండీగర్ లో ఉన్నారని సెల్ ద్వారా ఫోన్ చేసి కుమారుడితో రామగిరి ఉప్పలయ్య కలెక్టర్ కు మాట్లాడించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ సంతోషం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరు చదువుకోవాలని చదువు ద్వారానే మనము ఏం చేయాలనేది అర్థం అవుతుందని తద్వారా చర్యలు తీసుకోవడానికి ముందుకు పోగలుగు తామన్నారు.

ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న రామగిరి ఉప్పలయ్య ఇంటికి అంగన్వాడి సిబ్బంది ఆశా వర్కర్లు కలిసి ఇ స్టిక్కరింగ్ చేశారు.

అనంతరం కలెక్టర్ నెల్లికుదురు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. హాస్పిటల్ తీరును పర్యవేక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు మండల ప్రత్యేక అధికారి బాలరాజు జడ్పిటిసి జెర్రిపోతుల శ్రీనివాస్ రెడ్డి ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి తాసిల్దార్ రఫీ ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి డాక్టర్ శ్రావణ్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
—————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post