నూరుశాతం వ్యాక్సినేషన్ సాధించడం అభినందనీయం…

ప్రచురణార్థం

నూరుశాతం వ్యాక్సినేషన్ సాధించడం అభినందనీయం…

మహబూబాబాద్ సెప్టెంబర్ 25.

నూరుశాతం వ్యాక్సినేషన్ సాధించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ శశాంక ప్రశంసించారు.

శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో 100 శాతం సాధించిన 8 ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల డాక్టర్లను, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ సిబ్బందిని ఘనంగా శాలువాతో సత్కరించారు.

మహబూబాబాద్ లోని 32 వ వార్డు యూ పి హెచ్ సి లో 100% వ్యాక్సినేషన్ పూర్తిచేశారు అలాగే యూ పి హెచ్ సి తొర్రూరు డోర్నకల్ 15 వ వార్డు, పి హెచ్ సి మరిపెడ అర్బన్ 13వ వార్డు, కంబాలపల్లి పరిధిలోని ఈదుల పూస పల్లి , బయ్యారం పరిధిలోని గౌరారం బాలాజీ పేట, తీగల వేణి పరిధిలోని గాజుల గట్టు, బలపాల లో వంద శాతం పూర్తి చేసినట్లు జిల్లా వైద్యాధికారి కలెక్టర్కు వివరించారు

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ సాధింపు కు జిల్లాలో అత్యంత మారుమూల ప్రాంతం గంగారం మండలం వైద్యాధికారి డాక్టర్ ముకరం ను కలెక్టర్ శాలువా కప్పి ఘనంగా సన్మానిస్తూ ప్రశంసించారు కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరికి తినిపించారు ఈ వ్యాక్సిన్ కృషిచేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో ఇతర ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు కూడా నూరు శాతం సాధింపు వేగవంతంగా చేపట్టాలన్నారు.

జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు మాట్లాడుతూ తమ సిబ్బంది అంకితభావంతో పని చేస్తున్నారని ఒక ప్రక్క కోవిద్ ఉన్న ధైర్యసాహసాలతో వ్యాక్సినేషన్ కొనసాగిస్తున్నారని అన్నారు.

ఈ శుభాభినందన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ శిక్షణ కలెక్టర్ అభిషేక్ అగస్త్య టీఎన్జీవో అధ్యక్షుడు శ్రీనివాస్ వడ్డెబోయిన డాక్టర్లు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది.

Share This Post