నెలాఖరులోగా పెండింగ్ అర్జీలను పరిష్కరించాలి : జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

నెలాఖరులోగా పెండింగ్ అర్జీలను పరిష్కరించాలి : జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

ఈ నెలాఖరులోగా సర్వే పెండింగ్ అర్జీలను పరిష్కరించాలనీ జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ సర్వే, ల్యాండ్ రికార్డ్ అధికారులను ఆదేశించారు.

సోమవారం సాయంత్రం భూ సేకరణ ప్రగతి, రైతుల నుంచి వచ్చిన అర్జీల పరిష్కార ప్రగతి పై తన ఛాంబర్ లి జిల్లా అదనపు కలెక్టర్ సర్వే అండ్ రికార్డు అధికారులతో సమీక్షించారు.

రైతుల దరఖాస్తులను ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే పద్ధతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
పెండింగ్ దరఖాస్తులు ఎక్కువగా ఉన్న మండలాల పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

ఈ నెలాఖరులోగా అన్ని పెండింగ్ అర్జీలను క్లియర్ చేయాలని స్పష్టం చేశారు .
అనంతరం అదనపు కలెక్టర్ బోయిన్ పల్లి లో అదనపు టిఎంసి సర్వే పురోగతిపై అధికారులతో చర్చించారు.
సాధ్యమైనంత త్వరగా సర్వే పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
సమావేశంలో జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ అధికారి శ్రీనివాస్, డిప్యూటీ ఇన్స్పెక్టర్లు, డివిజన్, మండలం, జిల్లా సర్వేయర్ లు పాల్గొన్నారు.

Share This Post