నెలాఖరులోగా 100% వ్యాక్సిన్ పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ – హరీష్

నెలాఖరులోగా 100% వ్యాక్సిన్ పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ – హరీష్

జిల్లాలో ఇంకా మొదటి డోసు కోవిడ్ టీకా వేసుకొని వారిని గుర్తించి ఈ నెలాఖరులోగా అందరు వేసుకునేలా ప్రజలలో అవగాహన కలిగించవలసినదిగా జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ ప్రజాప్రతినిధులు, అధికారులను కోరారు. సోమవారం కలెక్టరేట్ లోని ఆడిటోరియం లో జిల్లా పరిషద్ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషద్ సాధారణ సర్వ సభ్య సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 5 లక్షల 10 వేల మందికి కోవిడ్ టీకాలు వేశామని, వాక్సిన్ ను కొరత లేదని, ఈ నెలాఖరు నాటికి అర్హులైన అందరికి టీకాలు వేసి శతశాతం కరోనా టీకాలు వేసిన జిల్లాగా చేయాలని కోరారు. జ్వరం లనంటి ఏ లక్షణాలున్న ఆర్.టి.పి .సి.ఆర్. పరీక్షలు చేయించుకోవాలని, రోజు 300 వరకు పరీక్షలు చేయుటకు వైద్యాధికారులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ముందస్తు చర్యలవల్ల డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూశామని, ఈ సంవత్సరం 26 డెంగ్యూ, 4 మలేరియా, రెండు చికెన్ గున్యా కేసులు మాత్రమే నమోదయ్యాయని, వారికి సరైన చికిత్స అందించామని అన్నారు. వ్యవసాయ రంగాన్ని సమీక్షిస్తూ ఈ వానాకాలంలో సుమారు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల పంట వచ్చే అవకాశముందని అన్నారు. రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన న కందులు,శనగలు,పేసర్లు వంటి వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. ఉపాధి హామీ పధకాన్ని సమీక్షిస్తూ 40 శాతం మెటీరియల్ కాంపోనెంట్ పనులు చేపట్టాలని అన్నారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజిలో 166 కోట్లు అందజేసి రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచామని అన్నారు. జిల్లా ఆహార శుద్ధి పరిశ్రమలు వేగంగా జరుగుచున్నాయని అన్నారు. 21 మండలాలలో బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని,ఇవిగాక మరో 4,5 మినీ బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు దిశగా అడుగులు వేస్టన్హున్నామని అన్నారు. ఆసరా పింఛన్ల గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30 వరకు పొడగించిందని అర్హులు దరఖాస్తు చేసుకోవలసిందిగా కలెక్టర్ సూచించారు. విద్యా శాఖను సమీక్షిస్తూ కరోనా వళ్ళ చాలా మాసాలు పాఠశాలలు తెరువనందున విద్యార్థులలో తెలుగు, ఇంగ్లీష్, ,మ్యాథ్స్ లో కనీస పరిజ్ఞానం ప్యూమ్పొందిచుటకు దసరా తరువాత త్రి ఆర్స్ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని అన్నారు. పాఠశాల విద్యార్థులు, అధ్యాపకుల హేతుబద్దెకారణ చేయాలని డి.ఈ.ఓ.కు సూచించారు. విద్యుత్ శాఖను సమీక్షిస్తూ జిల్లాలో 14 కోట్లతో కొత్తగా 9 ఉప కేంద్రాలు నిర్మించామని, మరో 5 కేంద్రాలు ప్రగతిలో ఉన్నాయని అన్నారు. మిషన్ భగీరథ క్రింద మిగిలిపోయిన గ్రామాలకు మంచినీటిని అందించుటకు పనులు వేగిరం చేస్తున్నామని, ప్రజలు వాల్వులు, నల్లాలు తొలగించరాదని కోరారు. పంచాయత్ రాజ్ క్రింద చేపట్టిన వివిధ పనులను నిర్ణీత కాలవ్యవవధిలో పూర్తి చేయాలని సూచించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ క్రింద దరఖాస్తుల సమర్పణలో వివిధ అధికారుల సంతకాల ప్రక్రియను స్ట్రీమ్ లైన్ చేయాలని సూచించారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలనీ అధికారులకు సూచించారు. జిల్లాలో కాలుష్య నియంత్రణ మండలి అనుమతి లేకుండా నడుపుతున్న రెండు పరిశ్రమలను మూసి వేయించామని, నిబంధనలు పాటించని మరో 4 పరిశ్రమలకు నోటీసులు ఇచ్చామని సభ్యులకు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామని అన్నారు. 131 మంది దివ్యానుగులకు బ్యాటరీ సైకిళ్ళు అందించామని, ఇంకా అర్హులైన వారికి జి.ఏం.ఆర్. ద్వారా అందించనున్నామని, వివరాలు అందజేయవలసినదిగా కలెక్టర్ సూచించారు.
పలువురు సభ్యులు మాట్లాడుతూ నార్సింగిలోని పాత పి .హెచ్.సి. పెచ్చులూడిపోయి కూలడానికి సిద్ధంగా ఉందని తెలుపగా నూతనంగా నిర్మించిన ఆస్పత్రికి పూర్తిగా షిఫ్ట్ కావలసినదిగా డి.ఏం.హెచ్.ఓ.కు సూచించారు. ప్రత్యామ్నాయ పంటలు వేయడానికి సబ్సిడీ అందించాలని సభ్యులు కోరారు. ఓ.డి.ఎఫ్. ప్లస్ గా గుర్తింపు పొందుటకు ఉపాధి హామీ పధకం క్రింద మరుగుడ్డ్లు మంజూరు చేయాలని కోరారు. విద్యుత్ స్థంబాలు, లైన్లు వేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు.ప్రజల పక్షాన ఉన్న ప్రజాప్రతినిధులకు గ్రామాలలో జరిగే అభివ్రుది ,సంక్షేమ కార్యక్రమాలకు ఆహ్వానం అందడంలేదని, ఉన్నతాధికారులు వచ్చిన తెలుపడం లేదని, ప్రోటోకాల్ ను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఆవిర్భవించి ఈ రోజుకు 5 సంవత్సరాలు అవుచున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా సస్యశామలంగా, అభివృద్ధి పధంలో ముందుకు సాగాలని జిల్లా పరిషద్ ఛైర్పర్సన్, కలెక్టర్ లు ఆకాంక్షించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్, జిల్లా పరిషద్ ముఖ్య కార్య నిర్వహణాధికారి శైలేష్, జిల్లా అధికారులు, జెడ్.పి .టి.సి. ఏం.పి .పి . సభ్యులు, తడిదితరులు పాల్గొన్నారు.

Share This Post