నెలాఖర్లోగా ధాన్యాన్ని బియ్యంగా మార్చాలి.

ప్రచురణార్థం

నెలాఖర్లోగా ధాన్యాన్ని బియ్యంగా మార్చాలి.

జనగామ మే 7.

ఈ నెలాఖరులోగా మిగిలిన (రబి- 2021) యాసంగి ధాన్యాన్ని బియ్యం గా మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆదేశించారు.

శనివారం కలెక్టర్ కార్యాలయంలోని అదనపు కలెక్టర్ చాంబర్లో యాసంగి ధాన్యాన్ని బియ్యం గా మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను సంబంధిత అధికారులతో నూ మిల్లర్ల తోనూ సమీక్షించారు.

ఈ సందర్భంగా అధికారులు వివరిస్తూ 2,29,222 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జిల్లాలోని 16 బాయిల్డ్ 12 రా రైస్ మిల్లు లకు అందజేయగా 93 శాతం బియ్యం అందజేసినట్లు తెలియజేశారు. 12 రా రైస్ మిల్స్ పూర్తి స్థాయిలో ధాన్యాన్ని బియ్యం గా మార్చి అందజేయగా 16 బాయిల్డ్ రైస్ మిల్స్ లో ఏడు మాత్రమే దాన్యాన్ని బియ్యం గా మార్చి అందజేశాయి అని మిగతా తొమ్మిది బాయిల్డ్ రైస్ మిల్స్ ధాన్యాన్ని బియ్యంగా మార్చి అందజేయవలసి ఉందని వివరించారు.

అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా మిగిలిన 9 బాయిల్డ్ రైస్ మిల్స్ ఏడు శాతం ధాన్యాన్ని బియ్యం గా మార్చి 11 583 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందజేయాలని మిల్లర్లకు సూచిస్తూ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రోజా రాణి సివిల్ సప్లై జిల్లా మేనేజర్ సంధ్యారాణి సివిల్ సప్లై డి టి లు నాయక్ విజయ్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట నారాయణ గౌడ్, బెల్దె వెంకన్న, 9 బాయిల్డ్ రైస్ మిల్లర్స్ తదితరులు పాల్గొన్నారు.
———————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం జనగామ వారిచే జారీ చేయడమైనది

Share This Post