నెహ్రు యువ కేంద్ర హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆజాది క అమృత్ మహోత్సవ సందర్బంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ శనివారం ఉదయం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమమును జాతీయ గీతం తో ప్రారంభించారు.

పత్రిక ప్రకటన 1                                                                                              14 ఆగష్టు 2021 హైదరాబాద్

నెహ్రు యువ కేంద్ర హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆజాది క అమృత్ మహోత్సవ సందర్బంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ శనివారం ఉదయం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమమును జాతీయ గీతం తో ప్రారంభించారు. ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ చార్మినార్ నుండి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్ షర్మాన్ ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించారు. 75 మందితో కొనసాగిన ఈ ర్యాలీ లో అనుసుమాన్ ప్రసాద్ దాస్, స్టేట్ డైరెక్టర్ నెహ్రు యువ కేంద్ర సంఘటన్ తెలంగాణ స్టేట్, డా.ఎన్.సురేందర్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, భాను ప్రసాద్ డీపీ ఆర్ ఓ, కుమారి ఖుష్బూ గుప్త, డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్, నెహ్రు యువ కేంద్ర హైదరాబాద్ , వి.చంద్ర శేఖర్ ప్రోగ్రామ్ సూపెర్వైసోర్, ఎన్ వై కె, భగవాన్ దాస్, మహేష్ వంశీ కృష్ణ, జాతీయ అవార్డు గ్రహీతలు, కాంతి కిరణ్, జాతీయ యువ జన వాళింటిర్స్ అతిధులుగా పాల్గొన్నారు. స్వాతంత్రం సంపాదించి పెట్టిన సమర యోధులను, జాతీయ నాయకుల సేవలను గుర్తుపెట్టుకోవడానికి, వారిని ఆదర్శంగా తీసుకొనడం, దేశ భక్తిని పెంపొందించుకోవడానికి, ఇటువంటి పరుగులు జాతీయ సమైక్యతా కొరకు ఉపయోగపడుతాయని, యువతను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు. అనంతరం ఫ్రీడమ్ రన్ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. పాల్గొన్న వారికీ వి. చంద్ర శేఖర్ ఎన్ వై కే కృతజ్ఞతలు తెలిపారు.

Share This Post