నేటి బాలలే రేపటి పౌరులు : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

2021-22 బాలల దినోత్సవం పురస్కరించుకొని నేటి బాలలే రేపటి పౌరులు, భావి తరాలను కాపాడుకోవలసిన బాధ్యత వారిపై ఉందని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో బాలల హక్కుల వారోత్సవాలపై పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. నేటి నుండి ఈ నెల 14వ తేదీ వరకు బాలల హక్కుల వారోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, బాలల హక్కుల గురించి అవగాహనతో పాటు నేర చరిత, బాల్య వివాహాలు, అమ్మాయి, అబ్బాయి అనే తారతమ్యం, బాల కార్మికులను నిర్మూలనతో పాటు గర్భస్థ పిండ నిర్ధారణ పరీక్ష లాంటి వాటిపై బాలలకు అవగాహన కల్పించడంలో మీడియా పాత్ర కీలకమైనదని అన్నారు. బాలలకు హక్కులపై అవగాహన కల్పించడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని, యువత నేటి నుండి వారం వరకు సమాజంలో ప్రతి ఒక్కరిపై బాలల హక్కుల గురించి తెలియజేయాలని, ఇందుకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో బాలల హక్కుల పరిరక్షణ చట్టాల గురించి తెలియజేయడంతో పాటు జిల్లాలో బాలల పరిరక్షణ యూనిట్‌ ఉందని తెలిపారు. వ్యక్తిగత బాధ్యతతో పాటు సామాజిక హక్షుగా పిల్లల చట్టాల అమలుపై ప్రతి ఒక్కరు కృషి చేయాలని, మంచి సమాజం కోసం అందరు ప్రయత్నం చేయాలని, బాలల హక్కులపై విసృత ప్రచారంతో పాటు మారుమూల కుగ్రామాలకు సైతం తెలిసేలా ప్రసార మాధ్యమాల ద్వారా వివరించాలని తెలిపారు. ఆడ పిల్లను చదివిద్దాం – రక్షిద్దాం అనే నినాదంతో మహిళా, శిశు సంక్షేమశాఖ ఏర్పాటు చేసిన యాప్‌ను ఆవిష్క్మరించడంతో పాటు సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని తొలి సంతకం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి ఉమాదేవి, బాలల పరిరక్షణ విభాగం అధికారి ఆనంద్‌, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post