నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు బాలలు అన్ని రంగాల్లో రాణించాలి అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్

 

నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు

బాలలు అన్ని రంగాల్లో రాణించాలి

అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్

ఘనంగా బాలల హక్కుల వారోత్సవాల ముగింపు

0000000

నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు.

శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గరిమా అగర్వాల్ మాట్లాడుతూ నేటి సమాజంలో బాలలు అన్ని రంగాల్లో ముందుండి వారి యొక్క హక్కులను సంపూర్ణంగా పొందాలని సూచించారు. బాల బాలికల మధ్య తల్లిదండ్రులు విభేదాలు చూపించకుండా ఇద్దరినీ సమానంగా చూడాలని తెలిపారు. పిల్లలు చదువుల్లోనే కాకుండా ఆటపాటల్లో పాల్గొని మానసిక ఉల్లాసాన్ని పొందేలా చూడాలని కోరారు. బాలబాలికల్లో నిగుఢీకృతంగా దాగిఉన్న శక్తిని వెలికి తీసి ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలని ఆమె తెలిపారు. అనంతరం బాలల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో పాల్గొని విజేతగా నిలిచిన వారికి అదనపు కలెక్టర్ బహుమతి ప్రధానం చేశారు.

రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు అనుమాండ్ల శోభారాణి మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ మనందరిపైనా ఉందని అన్నారు. బాలలు వారికున్న కళలను బయటకు తీసి ప్రదర్శించాలని తెలిపారు.

జిల్లా సంక్షేమ అధికారి రవీందర్ మాట్లాడుతూ బాలలు వారి హక్కులను సక్రమంగా పొందే విధంగా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు.

 

Share This Post