ఆదివారం రంగారెడ్డి జిల్లా వెనుకబడిన తరగతుల (బి.సి)సంక్షేమ శాఖ
ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి
రావు, భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భగీరథ మహర్షి పట్టువిడవకుండా
గంగను భూమికి తీసుకు వచ్చేందుకు ఎన్ని కష్టాలు ఎదురైనా వదలకుండా గంగను
భూమికి తీసుకువచ్చి తమ పూర్వీకుల పాపాలను తొలగించడంలో విజయం సాధించారని
తెలిపారు. కాబట్టి నేటి యువతరం భగీరథ మహర్షిని ఆదర్శంగా తీసుకొని
జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటూ తాము అనుకున్న
లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు వెళ్లాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి విద్య,కుల సంఘాల నాయకులు,
సంబంధిత అధికారులు, సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు