భారతదేశానికి స్వాతంత్రం సాధనలో అహింసా మార్గంలో పోరాడిన మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ నేటి యువత
ఆదర్శప్రాయుడని జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శనివారం గాంధీ జయంతి ఉత్సవాలలో భాగంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, వరుణ్రెడ్దిలతో కలిసి హాజరై గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం సాధించడంలో అహింసా, సత్యాగ్రహం లాంటి శాంతియుత మార్గాలలో అవిశ్రాంతంగా పోరాడి స్వాతంత్ర్యం సాధించారని, శాంతి, సామరస్యం, సహనంతో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీజీ చూపిన మార్గం అనుసరణీయమని అన్నారు. దేశ స్వాతంత్రమే లక్ష్యంగా సాగిన జాతిపిత జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని, గాంధీజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని యువత ముందు సాగుతూ లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు.
ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
అనంతరం జాతీయ, రాష్ట్ర జిల్లా స్థాయిలలో 2021 సంవత్సరంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన వారిని జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ గాంధీ జయంతి సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, వరుణ్‌రెడ్డిలతో కలిసి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకోవాలని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా రంగయ్య, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉదయ్‌బాబు, వెంకటేశ్వర్ లతో పాటు జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం అభినందనీయమని అన్నారు. తదనంతరం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సురేష్స్ జిల్లా విద్యాధికారి అశోక్, సంబంధిత శాఖల అధికారులు
తదితరులు పాల్గొన్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.