నేడు అంగారిక టౌన్ షిప్ ప్లాట్ల వేలం
జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
0 0 0 0 0
అంగారిక టౌన్ షిప్ 4వ విడత ప్లాట్ల ప్రత్యక్ష వేలమును నేడు గురువారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు.
తిమ్మాపూర్ మండలం మహత్మనగర్ లోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండలం లో అంగారిక టౌన్ షిప్ 75 ప్లాట్ల అమ్మకం ప్రక్రియ ను వేలం ద్వారా జూన్ 8 గురువారం రోజున నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ తెలిపారు. డిటిసిపి చే అనుమతి పొందిన ప్లాట్ల వేలం లో నివాస స్థలం ప్లాట్ లకు చదరపు గజానికి నివాస స్థలం 6 వేలు, వాణిజ్యస్థలం చదరపు గజానికి 8వేల చొప్పున వేలుగా నిర్ణయించడం జరిగిందని, ఈ వేలం లో పాల్గొనదలచిన వారు దరఖాస్తుతో పాటు ధరావత్తు సొమ్ము డిస్ట్రిక్ట్ కలెక్టర్ కరీంనగర్, రాజీవ్ స్వగృహ పేరున (EMD) 10వేల డి డి ని మరియు పాత రాజీవ్ స్వగృహ దరఖాస్తుదారులు ఎవరైతే 3వేలు లేదా 5వేలు రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించినచో ఆట్టి ఒరిజినల్ ఈ- సేవ రసీదును మరియు ఏవేని రెండు ఐడెంటి ప్రూఫ్స్ లను సుడా కార్యాలయంలో అందజేసి టోకెన్ పొందాలన్నారు. వేలంలో ప్లాట్ తీసుకున్న వారు పూర్తి సోమ్మును 7 రోజుల లోపు 33 శాతం, 45 రోజుల లోపు 33 శాతం, 90 రోజుల లోపు 33శాతం చెల్లించాలన్నారు. పూర్తి సోమ్మును నెల లోపు చెల్లించినట్లయితే 2శాతం డిస్కౌంట్ సౌలభ్యం కలదని కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు.