నేడు కస్టమర్ ఔట్రీచ్ ప్రోగ్రామ్ మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి కిషోర్

పత్రిక ప్రకటన

తేదీ : 07–06–2022

 

నేడు కస్టమర్​ ఔట్​రీచ్​ ప్రోగ్రామ్​

మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా లీడ్​ బ్యాంక్​ అధికారి కిషోర్​

ఆజాదీకా అమృత్​ మహోత్సవం ఐకాన్​ వారోత్సవాల్లో భాగంగా మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లాలో ఈ నెల 8న బుధవారం ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు ఉప్పల్​లోని నాగోల్​ మెట్రోస్టేషన్​ వద్ద ఎస్​వీఎమ్​ గ్రాండ్​లో కస్టమర్ ఔట్​రీచ్​ ప్రోగ్రామ్​ నిర్వహించనున్నట్లు  జిల్లా లీడ్ బ్యాంకు అధికారి కిషోర్​​ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కెనరా బాంక్, లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో  “మెగా రుణ మేళా” కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్​ హరీశ్​ ముఖ్య అతిధిగా హాజరవుతారని కిషోర్​ పేర్కొన్నారు. ఈ రుణమేళాలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని…  ప్రభుత్వ ప్రయోజిత పథకాలైన ముద్ర, పీఎం స్వానిధి, స్టాండ్​ ఆఫ్​ ఇండియా,  అగ్రి, పీఈఎంజీ, పీఎంఎఫ్​ఎమ్​, ఎమ్​ఎస్​ఎమ్​ఈ  రుణాలపై అవగాహన కల్పించి, అర్హులైన లబ్ధిదారులకు  తక్షణమే రుణాలు మంజూరు చేస్తారని వివరించారు. జిల్లా ప్రజలు రుణమేళా కార్యక్రమంలో పాల్గొని… సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కిషోర్​ కోరారు.

Share This Post