నేడు జి.యం.కన్వెన్షన్ హాల్ లో 155 మద్యం షాపులకు డ్రా ఎక్సైజ్ శాఖ నల్గొండ ఉప కమిషనర్ జి.అంజన్ రావు

 నేడు జి.యం.కన్వెన్షన్ హాల్ లో 155 మద్యం షాపులకు డ్రా
 ఎక్సైజ్ శాఖ నల్గొండ ఉప కమిషనర్ జి.అంజన్ రావు
జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 155 మద్యం షాపులకు   నవంబర్ 20 న శనివారం  రోజున గుండ గోని మైసయ్య కన్వెన్షన్ హాల్ (జి.యం.కన్వెన్షన్ హాల్),చైతన్య పురి కాలనీ, గంధంవారి గూడెం రోడ్డు, నల్గొండ జిల్లా కేంద్రంలో   డ్రా  తీయటం ద్వారా మద్యం షాపులు కేటాయించడం జరుగుతుందని నల్గొండ జిల్లా ఎక్సైజ్ శాఖ ఉప కమిషనర్ జి.అంజన్ రావు తెలిపారు. జి.యం. కన్వెన్షన్ హాల్ లో ఏర్పాట్లను  ఎక్సైజ్ శాఖ ఉప కమిషనర్  జి.అంజన్ రావు, శుక్రవారం రోజున అసిస్టెంట్ కమిషనర్ వి. శంభు ప్రసాద్, (ఎన్ఫోర్స్ మెంట్ విభాగం),ఎక్సైజ్ సూపరింటెండెంట్ వై. హిమశ్రీ,పోలీస్ అధికారులతో కలిసి ఏర్పాట్ల ను ఆయన పరిశీలించారు. జిల్లాలో మొత్తం 155 మద్యం షాపులను 4079 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. దరఖాస్తు దారులు శనివారం ఉదయం 9  గంటల కు జి.యం.కన్వెన్షన్ హాల్ కు చేరుకోవాలని తెలిపారు.

Share This Post