పత్రిక ప్రకటన
నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా కాజీపేట లో All India Confedaretion of SC/ ST Organagation మరియు షెడ్యూల్డ్ కులాల సాధికారిక సమితి- కార్మిక విభాగం రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో”మేడే”వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహేశ్వర్ రాజు గారు మాట్లాడుతూ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారు భారత దేశ కార్మికుల కోసం ఎన్నో హక్కులు, దేశానికి స్వాతంత్ర్యం రాకముందు లేబర్ మెంబర్ హోదాలో ఎన్నో హక్కులు కల్పించారు. ముఖ్యంగా పద్నాలుగు గంటల పని విధానాన్ని కుదించి ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేశారు. అంతేకాకుండా మహిళలకు మెటర్నిటీ సెలవులు మరియు కార్మికులు తమ తమ సంస్థలో కార్మిక సంఘాలు నెలకొల్పే అవకాశం కల్పించి వారి హక్కులు పొందడానికి అవకాశం కల్పించి నారు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అల్ ఇండియా Confedaretion
ఆఫ్ Sc/ St Organization తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహేశ్వర్ రాజు గారు, అఖిల భారత తపాల ఎస్ సి/ ఎస్ టి ఉద్యోగుల సంక్షేమ సంఘం తెలంగాణ సర్కిల్ అధ్యక్షులు చలపతి గిరి గారు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సమితి అధ్యక్షుడు అనుకాంత్ గారు, తెలంగాణ అల్ ఇండియా Confedaretion ఆఫ్ Sc St Organagation Co కన్వీనర్ శ్రీనివాస్ రావు గారు, తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు Ponnakal ఎల్సరి కృష్ణయ్య ఏకలవ్య గారు, ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అక్కి రాంబాబు గారు, సూర్యం (ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీ) గారు, ప్రభాకర్ (పోస్టల్) గారు, రామస్వామి (పోస్టల్) గారు, ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ కోశాధికారి V. విద్యాసాగర్ గారు, సదానందం గారు(పోస్టల్), బత్తుల రాంబాబు (అంబేద్కర్ విగ్రహ కమిటీ మెంబర్) గారు, కె యస్ జయబాబు, బి. నర్సింగ్ రావు గారు, హన్మంతు రావు గారు సురేష్ గారు తదితరులు పాల్గొన్నారు.