*నేడు బద్దెనపెల్లి గురుకుల పాఠశాలలో NDRF బృందం ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహణ :: ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు*

*నేడు బద్దెనపెల్లి గురుకుల పాఠశాలలో NDRF బృందం ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహణ :: ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు*

*ప్రచురణార్థం-1*

రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 21: నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందం ఆధ్వర్యంలో నేడు (బుధవారం) తంగళ్ళపల్లి మండలం బద్దెనపెల్లి గురుకుల పాఠశాలలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు జిల్లా ఇంచార్జ్ రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు తెలిపారు. మాక్ డ్రిల్ నిర్వహణపై మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని జిల్లా రెవిన్యూ అధికారి చాంబర్ లో సంబంధిత శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అకస్మాత్తుగా రసాయనాలు లీక్ జరిగి ప్రమాదాలు సంభవించినప్పుడు ఆ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడడానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రమాద బాధితుల రక్షణ, ప్రమాద ప్రదేశం, పరిసరాల్లో చేపట్టాల్సిన చర్యల గురించి ప్రజల్లో అవగాహనకు ఈ బృందం మాక్ డ్రిల్ నిర్వహిస్తుందని జిల్లా రెవిన్యూ అధికారి తెలిపారు.
ఈ సమీక్షలో సిరిసిల్ల జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డా. మురళీధర్, ఫైర్ అధికారి సతీష్, ఎన్డిఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్లు గౌతమ్ కుమార్, యోగేష్ వర్మ, ఎస్బి ఇన్స్పెక్టర్ మహ్మద్ సర్వర్, గురుకుల ప్రిన్సిపాల్ పద్మ, సిరిసిల్ల మండల తహసీల్దార్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post