జనగామ, సెప్టెంబర్ 25:
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సబ్బండ వర్గాల ఆత్మ గౌరవ ప్రతీక, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారికంగా నిర్వహించనున్నట్లు
జిల్లా కలెక్టర్ సిహెచ్. శివ లింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. నేడు ఉదయం 11.00 గంటలకు కలెక్టరెట్లో వేడుకలు ప్రారంభo అవుతాయని ఆయన అన్నారు. ప్రజాప్రతినిధులు, కుల సంఘాల ప్రతినిధులు వేడుకలలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి జనగామచే జారీ చేయనైనది.