నేడు 4 నామినేషన్లు దాఖలు- జిల్లా ఎన్నికల అధికారి హరీష్

నేడు 4 నామినేషన్లు దాఖలు- జిల్లా ఎన్నికల అధికారి హరీష్

04-మెదక్ స్థానిక సంస్థల నియోజక వర్గం నుండి తెలంగాణ శాసన మండలి సభ్యుని ఎన్నికకు సోమవారం నాడు నాలుగు నామినేషన్లు ధాఖలు అయ్యాయి. గజ్వేల్ నియోజక వర్గానికి చెందిన ఒంటెరి యాదవ రెడ్డి టి. ఆర్. ఎస్. పార్టీ నుండి నామినేషన్ ధాఖలు చేయగా, సంగారెడ్డి నియోజక వర్గానికి చెందిన బోయిని విజయలక్ష్మి, మెదక్ నియోజక వర్గానికి చెందిన ఐరేణి సత్యనారాయణ గౌడ్, గజ్వేల్ నియోజక వర్గానికి చెందిన సాయిబాబా చింతల లు స్వతంత్ర అభ్యర్థులుగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హరీష్ కు నామినేషన్ పత్రాలు ధాఖలు చేశారు. నామినేషన్లు ప్రారంభమైన 16 నుండి నేటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లా నుండి మొత్తం ఐదు మంది అభ్యర్థులు (6) నామినేషన్లు ధాఖలు చేశారు. అందులో స్వతంత్ర అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ ఈ నెల 18 న రెండు సెట్ల నామినేషన్ వేశారు.

Share This Post