నేడే జిల్లాలో సామూహిక జాతీయ గీతాలాపన-జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

నేడే జిల్లాలో సామూహిక జాతీయ గీతాలాపన

సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ప్రజలందరు పాల్గొని దేశభక్తిని,జాతీయ భావాన్ని చాటాలి

-జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

——————————

——————————
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా నేడు (16 వ తేదీ మంగళవారం రోజున) ఉదయం 11:30 కి నిర్వహించబోయే సామూహిక జాతీయ గీతాలాపనలో ప్రజలు అందరు పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ నెల 16-08-2022 మంగళవారం ఉదయం 11:30 గంటలకు జిల్లా కేంద్రంలో,మండల కేంద్రలల్లో, గ్రామలల్లో సామూహికంగా జాతీయ గీతాలాపన నిర్వహించడం జరుగుతుంది.
పట్టణాలలో,గ్రామాలలో ప్రజలు ప్రధాన కూడళ్ళ దగ్గరికి పెద్ద ఎత్తున చేరుకొని జాతీయ గీతాలాపన చేయాలి.

జాతీయ గీతాలాపన సమయంలో ఆయా పనుల్లో ఉన్నవారు, వాహనాలు నడుపుతున్న వారు అగి ఎక్కడికక్కడే నిలబడి ఉండాలి జాతీయ గీతం ప్రసారం అవగానే ప్రజలందరూ జాతీయ గీతం పాడి దేశ భక్తిని,జాతీయ భావాన్ని చాటుతూ మహనీయుల త్యాగాలను,స్ఫూర్తిని స్మరిస్తూ భారత కీర్తిని దశ దిశల చాటాలి.
గ్రామంలో ఉన్న కమ్యూనిటీ సంఘాలు, యూనియన్ సభ్యులు, మహిళా సంఘాలు, స్కూల్ పిల్లలు, యూత్ సభ్యులు, గ్రామ పంచాయితీ పాలక వర్గం, ప్రతి ఒక్కరూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చెయ్యాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పిలుపు నిచ్చారు.

——————————

Share This Post