నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్, సీజనల్ వ్యాధులు, వ్యాక్సినేషన్ పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

సిరిసిల్ల, అక్టోబర్ 30: నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్, సీజనల్ వ్యాధులు (మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, జ్వరం), వ్యాక్సినేషన్ పై సంబంధిత వైద్య శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమీక్షించారు.

శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశం మందిరంలో వైద్య శాఖ అధికారులతో సమీక్షించి పలు అంశాలపై చర్చించారు.

మొదటగా ఎల్వీ ప్రసాద్ సంస్థ డైరెక్టర్, ప్రతినిధులతో మాట్లాడి జిల్లాలోని పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గల అంగన్వాడీ కేంద్రాలలో గల పిల్లలలో కంటి లోపంతో బాధపడే వారిని గుర్తించి స్క్రీనింగ్ చేయాలని కలెక్టర్ అన్నారు. దీనికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ త్వరగా సిద్ధం చేయాలని ఆదేశించారు.

అలాగే ఇంటిటి సర్వే చేస్తూ జ్వరం వచ్చిన వారిని గుర్తించి వారికి డెంగ్యూ, మలేరియా, కోవిడ్ టెస్టింగ్ తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ సూచించారు. అలాగే వ్యాక్సిన్ అందరూ తీసుకునేలా క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. కోవిడ్ టెస్టింగ్ ఎక్కువగా చేస్తూ పాజిటివిటీ రేట్ ను తగ్గించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్, ఎల్వీ ప్రసాద్ సంస్థ డైరెక్టర్ డా.రోహిత్ కన్నా, జిల్లా వైద్యాధికారి డా.సుమన్ మోహన్ రావు, ప్రోగ్రామ్ అధికారులు, పర్యవేక్షకులు, మెడికల్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post