నేషనల్ హైవే 164 పనులు త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అన్నారు

ప్రెస్ రిలీజ్. తేది 09.08.2021 నేషనల్ హైవే 164 పనులు త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో సోమవారం జాతీయ రహదారి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైవే లో భూములు పోయిన రైతులకు పరిహారం అందించాలని సూచించారు. రోడ్డు వెడల్పు పనులకోసం ఫారెస్ట్, నేషనల్ హైవే అధికారులు సంయుక్త సర్వే చేపట్టాలని కోరారు. ఈ నెల 11 నుంచి 13 వరకు సర్వే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్తు సమస్యలను గుర్తించి వాటికి అవసరమయ్యే ఎస్టిమేషన్ వేయాలని ట్రాన్స్ కో అధికారులను కోరారు. మిషన్ భగీరథ పైప్ లైన్ వాటిని షిఫ్టు చేయడానికి ఎస్టిమేషన్ వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, ఆర్ డి వో లు శీను, రాజా గౌడ్, నేషనల్ హైవే అధికారులు, ట్రాన్స్కో, మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు. Dpro..Kamareddy.

Share This Post