నైపుణ్యమైన చీరలను తయారు చేయాలి :- రాష్ట్ర ఐ.టి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్

నైపుణ్యమైన చీరలను తయారు చేయాలి :- రాష్ట్ర ఐ.టి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్.

నారాయణపేట చీరలు అంటే భారతదేశం లోని చాలా ప్రాముఖ్యత కలదని గురువారం జిల్లా కేంద్రం లోని చిత్రిక ఆర్టిసన్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారు ధూల్ పేట సీకిల్ గెరి లో  నిర్వహిస్తున్న చేనేత కార్మికులనుదేశించి ఇంకా నాణ్యమైన చీరలను తయారు చేయాలని జయేష్ రంజన్ తెలిపారు. నారాయణపేట చీరలను ప్రసిద్ధి గాంచింది నారాయణపేట మోడల్ కాకుండా వేరే రకమైన డిజైన్ లైన చీరలను తయారు చేయాలని సూచించారు. కార్మికులకు నైపుణ్యాన్ని పెంచేందుకు అనుభవజ్ఞులతో శిక్షణ ఇపించడం జరుగుతుందని కార్మికులకు తెలిపారు. చీరలు కాకుండా ఇంకా ఇతరత్రా దుస్తులను తయారు చేయాలని తెలిపారు. టెక్స్ట్ల్ పార్క్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపరి. ఇంకా నేర్చుక్పోవడానికి మేము సిద్దము గా ఉన్నామని అక్కడున్న కార్మికులు కమిషనర్ కు తెలిపారు. మగ్గాలను పరిశీలించి జిల్లా కలెక్టర్ డి హరిచందన తో కలిసి కార్మికులు తయారుచేసిన వివిధ రకాల చీరాలను  పరిశీలించారు.

Share This Post