నోడల్ అధికారులు,మల్టీ డిసిప్లినరి టీం ప్రతి ఇల్లు తిరిగి సర్వే చేసి వ్యాక్సినేషన్ చేపట్టాలి. : :జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, అక్టోబర్ 28: నోడల్ అధికారులు, మల్టీ డిసిప్లినరీ టీం ప్రతి ఇల్లు తిరిగి సర్వే చేసి వ్యాక్సినేషన్ చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. గురువారం జిల్లాలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రత్యేక శిభిరాలు ఏర్పాటు చేసిన డిసిప్లినరీ టీంల పనితీరును కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసారు. రఘునాథపల్లి మండలకేంద్రంలో కమిటీ సభ్యులతో సమావేశమై తీసుకున్న చర్యల గురించి ఆరా తీసారు. పాత సర్వే కాకుండా వెంటనే కొత్త గా ఇంటింటి సర్వే చేస్తూ వ్యాక్సినేషన్ చేపట్టాలని కలెక్టర్ అన్నారు. ఖిలాశాపురం గ్రామంలో జరుగుతున్న సర్వే, వ్యాక్సినేషన్ తీరును కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. కమిటీ లోని అధికారులు, సభ్యులు, పక్కాగా విధులకు హాజరై నిర్దేశించిన ప్రకారం విధులు నిర్వహించాలని లేని పక్షంలో చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు. అనంతరం లిగాల ఘనపురం మండల కేంద్రంలో అధికారులతో సమావేశమయ్యారు. కళ్లెం గ్రామంలో జరుగుతున్నా ప్రక్రియ నూ పరిశీలించారు నవంబర్ 3 లోగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో, వార్డుల్లో నూరు శాతం వ్యాక్సినేషన్ చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఏ. మహేందర్, మండల వ్యాక్సినేషన్ ప్రత్యెక అధికారులు కె. రాము, కెఆర్. లత, ఎంపిడీఓ హసీం, తహసిల్దార్ బన్సీలాల్, మండలాల వైద్యాధికారులు, టీం సభ్యులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారి చేయనైనది.

Share This Post