న్యాయం ముందు అందరూ సమానులే – మెదక్ జిల్లా 8వ అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జి సునీత

న్యాయం ముందు అందరూ సమానులే – మెదక్ జిల్లా 8వ అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జి సునీత

న్యాయం ముందు అందరూ సమానులేనని, నిరుపేదలకు ఉచిత న్యాయ సహాయం, సేవలు అందించడమే న్యాయ సేవాధికార సంస్థ ధ్యేయమని, రాజ్యాంగం కల్పించిన ఉచిత న్యాయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవలసినదిగా మెదక్ జిల్లా 8వ అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జి సునీత కోరారు. స్వాతంత్య్రం సిద్దించి 75 వసంతాలు అయినా సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాది కా అమ్రిత్ మహోత్సవ పేరిట వివిధ విభాగాల ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నది, అందులో భాగంగా న్యాయ సేవలు ప్రతి గడపకు తెలపాలని ఉద్దేశంతో అవగాహన న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. శనివారం కోర్టు మండల పరిధిలోని 10 మండలాలకు చెందిన ఏం.పి .ఓ.లు, పంచాయతీ కార్యదర్శులు, డి.ఎల్.పి .లతో న్యాయ సేవల అవగాహనపై ఏర్పాటు చేసిన పాన్ ఇండియా అవేర్ నెస్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ప్రతి బీదవానికి న్యాయం అందించాలని రాజ్యాంగం మనకు హక్కు కల్పించిందని, ఇది గ్రామా స్థాయి ప్రజలకు తెలియక న్యాయం పొందలేకప్లోతున్నారని భావించి సుప్రీమ్ కోర్టు ఆదేశాల మేరకు న్యాయాధికార సంస్థ ద్వారా అక్టోబర్ 2 నుండి నావంబర్ 14 వరకు అవా గాహన కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. జిల్లా,మండల స్థాయిలో ఉన్న న్యాయ సేవాధికార సంస్థలను సంప్రదించి తమ సమస్యలను తెల్లకాగితం పై వ్రాసి ఇచ్చినట్లయితే రాజీ మార్గానికి ప్రయత్నిస్తామని, లేనిచో ఉచితంగా కేసు వాదించి పరిష్కరిస్తామని అన్నారు. ఇప్పటి వరకు ఖర్చు లేని న్యాయం ఒక పొలిసు విభాగం నుండే జరుగుచుండగా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఎస్సి,ఎస్టీ,మహిళలు,వృద్దులు, వికలాంగులు,చిన్నారులు, 4 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికీ ఉచితంగా న్యా సేవలు అందిస్తున్నామని ఆమె తెలిపారు. నిత్యం ప్రజలతో మమేకమై ఉండే పంచాయతీ కార్యదర్శుల మాటలను గ్రామా ప్రజలు వేదవాక్కుగా భావిస్తారని, వారు చెబితే తప్పక అర్థం చేసుకుంటారేనే ఉద్దేశంతో జిల్లాలోని 175 గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి వారికి న్యాయ సేవల పట్ల అవగాహన కలిగిస్తున్నామని అన్నారు. ఇందుకు సంబంధించి ప్రచురించిన కరపత్రాన్ని ప్రతి గ్రామ పంచాయతీ గోడపై అతికించి అవగాహన కల్పిస్తూ ఫోటో తీసి పంపవలసినదిగా కోరారు. ఇట్టి సమాచారాన్ని ఒకరి నుంచి మరొకరికి చైన్ లింక్ లా అందరికి చేరే విధంగా ప్రాచుర్యం కల్పించాలని సునీత కోరారు.
సీనియర్ సివిల్ జడ్జి సంతోష్ కుమార్ మాట్లాడుతూ చట్టం ముందు అందరు సమానులేనని, వివక్షత ఉండదని అన్నారు. పార్లమెంటు అభిప్రాయాలు ప్రజల లోకి తీసుకెళ్లేలా దేశంలోని 6 లక్షల 77 వేల గ్రామాలలో ఉచిత న్యాయ సేవలపై అవగాహాన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్ర రెడ్డి, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, న్యాయవాదులు, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, డి.ఎల్.పి .ఓ.లు సుధాకర్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, వరలక్ష్మి, ఏం.పి .ఓ.లు, గ్రామా పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

Share This Post