DPRO ADB -న్యాయవ్యవస్థపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగిఉండలి- రాష్ట్ర న్యాయ సేవ అథారిటీ సభ్య కార్యదర్శి వై.రేణుక

న్యాయవ్యవస్థపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగిఉండి, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి వై.రేణుక అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్ నుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సభ్య కార్యదర్శి మాట్లాడుతూ, ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం లో భాగంగా న్యాయవ్యవస్థ పై ప్రజలకు అవగాహన కల్పించడం, న్యాయసేవా అధికార సంస్థల ద్వారా ప్రజలకు ముఖ్యంగా పేదవర్గాల వారికీ ఉచితంగా న్యాయసహాయం అందించడం, వివిధ సందర్భాలలో అభాగ్యులు, నిరుపేదలకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేపట్టడం జరుగుతుందని అన్నారు. సామజిక దృక్పధం, పేదవర్గాల అభ్యున్నతికి న్యాయ సహాయం అందించే విధంగా జిల్లాల్లో న్యాయ సేవ కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. వివిధ సందర్భాలలో క్రిమినల్, సివిల్ కేసులలో పేదలకు సహాయం అందించేందుకు న్యాయ సేవ సంస్థ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఆర్థికంగా, సామాజికంగా ఉన్నవారికి న్యాయసేవలు దక్కుతున్నాయని, పేదవర్గాలకోసం ఉచిత సహకారం అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను 43 రోజుల పాటు విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహించి న్యాయ సేవలపై గ్రామగ్రామాన తెలియపరచడం జరుగుచున్నాయని అన్నారు. మాదకద్రవ్యాల వినియోగం, పేదరిక నిర్మూలన వంటి అంశాలపై వివరించడం జరుగుచున్నదని తెలిపారు. ఆర్థిక స్థోమత లేని, న్యాయసహయంపై అవగాహన లేని వారికీ జిల్లా న్యాయ సేవ అథారిటీ ఉందనే విషయాన్నీప్రజలందరికి తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. చట్టం ముందు అందరు సమానులే అని అన్నారు. బాధితులకు జిల్లా యంత్రాంగం సహకారంతో పరిహారం అందించడం జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని జిల్లా యంత్రాంగం న్యాయసేవ  అథారిటీకి వారధులుగా పనిచేస్తున్నారని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమాలు నవంబర్ 14 వ తేదీ నాటికి ముగియనున్నాయని తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, ఆజాదికా అమృత్ మహోత్సవ్ సందర్బంగా జిల్లాలో ప్రభుత్వ శాఖలు, జిల్లా న్యాయ సేవ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. రెవెన్యూ, పంచాయితీ, న్యాయ, వివిధ శాఖల ద్వారా కార్యక్రాలను ఏర్పాటు చేసి సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా న్యాయసేవా అథారిటీ కార్యదర్శి క్షమా దేశ్ పాండే, అదనపు కలెక్టర్లు ఎన్.నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, మున్సిపల్ కమీషనర్ శైలజ, అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.సాధన, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, సఖి కేంద్రం ప్రతినిధి యశోద, న్యాయ సేవ అథారిటీ కార్యాలయం పర్యవేక్షకురాలు శైలజ, తదితరులు పాల్గొన్నారు.

Share This Post