.“న్యాయ సేవలు  మరియు  ప్రజల యొక్క న్యాయ అవసరాలు-  న్యాయ సేవా సంస్థ పాత్ర” అనే అంశంపై  అవగాహన సదస్సు : 

వార్త ప్రచురణ

తేదీ.07.10.2021.

ములుగు జిల్లా.

 

దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలో నేటి  నుండి న్యాయస్థానాలు  అందించే వివిధ పథకాలు మరియు సౌకర్యాల గురించి అక్టోబర్ 7 నుండి  నవంబర్ 14 వరకు జరిగే  వివిధ సంక్షేమ కార్యక్రమాల అవగాహన సదస్సులు  గురువారం నాడు  బాల రక్షా భవన్ లో ప్రారంబించారు.   ఈ కార్యక్రమానికి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి శ్రీ ఎం రామచంద్ర రావు , అదనపు జూనియర్ సివిల్ జడ్జి  శ్రీ వెంకటేశ్వర్లు  ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.“న్యాయ సేవలు  మరియు  ప్రజల యొక్క న్యాయ అవసరాలు-  న్యాయ సేవా సంస్థ పాత్ర” అనే అంశంపై  అవగాహన సదస్సు   జిల్లా సంక్షేమ అధికారి ఈ పి ప్రేమ లత అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికార epప్రేమ లత మాట్లాడుతూ  సంక్షేమ కార్యాలయం మహిళలు వృద్ధులు బాలలు మరియు దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో  పరిరక్షణ మరియు హక్కుల కొరకై గ్రామస్థాయిలో వివిధ విభాగాల సమన్వయంతో కృషి చేస్తున్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి గారు మాట్లాడుతూ  ప్రభుత్వ అందించే వివిధ  పథకాల అమలు లో ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఎదురైనట్లేతే  న్యాయ సేవా సంస్థ వారిని ఆశ్రయించి నట్లు అయితే ఉచితంగా న్యాయం   పొందవచ్అచునని  వారు తెలుపారు.  ఈ సందర్భాగా  మొబైల్  కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం మరియు న్యాయ సేవా సంస్థ  చట్టం ఆధారంగా ఏర్పాటైందని, ఈ సందర్భంగా మానసిక వికలాంగులు మహిళలు సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి ప్రజలు  న్యాయ  అవసరాల  కొరకు క్రింది స్థాయి నుంచి  సుప్రీంకోర్టు వరకు అందించే వివిధ  సేవలను వినియోగించుకోవాలని అన్నారు. తద్వారా కేసులు త్వరగా పరిష్కరం  అయ్యేలాగునా  న్యాయవ్యవస్థ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ఈ సమావేశంలో బాల రక్షా భవన్ కోఆర్డినేటర్  స్వాతి , సఖి వన్ స్టాప్ సెంటర్  రమాదేవి, బాలల పరిరక్షణ విభాగం రక్షణాధికారి j ఓంకార్,  బన్ను  చైల్డ్ లైన్,జిల్లా కోఆర్డినేటర్  బి ప్రణయ తదితరులు పాల్గొన్నారు .

Share This Post