న్యాయ సేవల పై ప్రజల్లో అవగాహన కల్పించాలి :: రాష్ట్ర లీగల్ సర్వీస్ ఆథారటీ మెంబర్ సెక్రటరీ వై.రేణుక

ప్రచురణార్థం -1 తేది.11.11.2021
న్యాయ సేవల పై ప్రజల్లో అవగాహన కల్పించాలి :: రాష్ట్ర లీగల్ సర్వీస్ ఆథారటీ మెంబర్ సెక్రటరీ వై.రేణుక
జగిత్యాల , నవంబర్ 11:-
న్యాయ సేవల పై ప్రజల్లో అవగాహన మరియు విస్తృత ప్రచారం కల్పించాలని రాష్ట్ర లీగల్ సర్వీస్ ఆథారటీ మెంబర్ సెక్రటరీ వై. రేణుక జిల్లా కలెక్టర్లను కోరారు. లీగల్ సర్విస్ ఆథారటీ ద్వారా అందించే సేవలు, బాధితులకు పరిహారం అందజేత తదితర అంశాల పై రాష్ట్ర లీగల్ సర్వీస్ ఆథారటీ మెంబర్ సెక్రటరీ గురువారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి ఉమ్మడీ కరీంనగర్ జిల్లా పరిధిలోని కలెక్టర్లలు, పోలిస్ అధికారులు మరియు ఇతర జిల్లా అధికారుల తో వీడియో కాన్పరెన్సు నిర్వహించారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే దిశగా కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు.జాతీయ న్యాయ సేవా సంస్థ చైర్మన్ చీఫ్ జస్టీస్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు అక్టోబర్ 2,2021 నుంచి నవంబర్ 14,2021 వరకు 6 వారాల పాటు గ్రామాలో న్యాయ సేవల వినియోగం పై అవగాహన కల్పించామని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరు సమానమని, అందరికి సమానమైన న్యాయ హక్కు ఉండాలని, దీని సాధించేందుకు 47వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టీకల్ 39 రాజ్యంగంలో పోందుపర్చడం జరిగిందని, దీని ద్వారా లీగల్ సర్వీస్ ఆథారటీ చట్టాన్ని 1987 లో ఆమోదించామని తెలిపారు. లీగల్ సర్వీస్ చట్టం ద్వారా జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలలో లీగల్ సర్విస్ ఆథారటీ ఏర్పాటు చేసామని తెలిపారు. అవసరమైన వారికి ఉచిత న్యాయ సేవలు అందించటం, చట్టాల పై అవగాహన కల్పన, లోకాథాలత్ ద్వారా సత్వర న్యాయం అందించడం వీటి ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు.
సమాజంలో ధనవంతులు, పలుకుబడి గల వారు అవసరమైన న్యాయ సేవలు పోందుతున్నారని, పేదవారు సైతం అవసరమైన న్యాయ సేవలను ఉచితంగా పొందేందుకు వ్యవస్థను రుపొందించడం జరిగిందని తెలిపారు.సామాజిక, ఆర్థిక, విద్య వెనుకబాటుతన్నం వల్ల న్యాయ సేవలు పొందడంలో ఆటంకం కల్గవద్దని లీగల్ సర్వీస్ ఆథారటీని ఏర్పాటు చేసారని తెలిపారు. లీగల్ సర్వీస్ ఆథారటీ సేవలను ప్రజలు విస్తృతంగా వినియోగించుకునే విధంగా ప్రచారం కల్పించాలని ఆమె కోరారు. 6 వారాల పాటు దేశంలోని వివిధ బృందాలను ఏర్పాటు చేసి గ్రామాలో అవగాహన కల్పించామని, ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాలో మాధక దృవ్యాల నిరోధన చట్టం, వరకట్న నిర్మూలన చట్టం మొదలైన ముఖ్యమైన చట్టాల పై అవగాహన కల్పించామని తెలిపారు.
ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం పై పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన ఉందని గమనించామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల స్థాయిలో లీగల్ సర్విస్ ఆథారటీ పై సైతం అవగాహన కల్పించాలని, గ్రామాలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న సమయంలో దీని పై ప్రస్తావించాలని ఆమె కలెక్టర్లను కోరారు. జిల్లా కోర్టులోని న్యాయ సేవ సథన్ లో జిల్లా లీగల్ సర్విస్ ఆథారటీ, ప్రతి కోర్టులోని ఒక విభాగం మండల లీగల్ సర్విస్ ఆథారటీ పనిచేస్తుందని, వీరిని సంప్రదిస్తే ఉచిత న్యాయ సలహాలు, సేవలు అందిస్తారని తెలిపారు. ఉచిత న్యాయ సేవలను అందరు మహిళలకు, ఎస్సీ, ఎస్టీలకు, పిల్లలకు, కార్మికులకు, శారీరికంగా మానసికంగా దివ్యాంగులకు, వార్షిక ఆధాయం 3 లక్షల లోపు ఉన్నవారందరికి అందించడం జరుగుతుందని తెలిపారు. నేరస్థులను శిక్షించడంతో పాటు బాధితుల సంరక్షణ సైతం మనందరి బాధ్యత ఉంటుందని, దీని పై రాష్ట్ర ప్రబుత్వం 2018 సంవత్సరంలో బాధితులకు పరిహారం అందించాలని నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.
యాసిడ్ బాధితులకు రూ.10 లక్షలు, ఆత్యాచార బాధితులకు రూ.7 లక్షలు, హత్య నేరంలో బాధిత కుటుంబానికి రూ.7 లక్షలు, శాశత్వ వైకల్యానికి రూ.5 లక్షలు, గాయాలకు రూ.1 నుంచి 2 లక్షలు, వరకటన్న వేధింపులో మరణించిన వారి మైనర్ పిల్లలకు రూ.3 నుంచి 4 లక్షలు ఫిక్సిడ్ డిపాజిట్ చేయడం వంటి పరిహరాలను అందించడం జరుగుతుందని, దీనికి సంబంధించి నిధులను ప్రబుత్వం అందిస్తుందని తెలిపారు. 2016 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 92 మంది మాత్రమే బాధితులకు పరిహారం వినియోగించుకున్నారని, బాధితులకు పరిహారం అందించే అంశం పై కలెక్టరేట్ లకు వచ్చే దరఖాస్తులను జిల్లా న్యాయ సేవా సంస్థలకు అందించాలని ఆమె సూచించారు.
బాధితులకు పరిహారం అందించే అంశం పై సైతం అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. మన భారతరాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి జీవించడానిక ప్రాథమిక హక్కు ఉందని, సమాజంలో ప్రతి ఒక్కరికి గౌరవపూర్వకంగా జీవించే హక్కు ఉందని, ఆర్థిక, సామాజిక, విద్యా భేదాలు లేకుండా న్యాయం ప్రతి ఒక్కరికి అందాలని ఆమె తెలిపారు. లీగల్ సర్విస్ ఆథారటీ అందించే సేవల పై 1 రోజు గ్రామాలో టాం టాం ద్వారా, ఇంటింటి ప్రచారం ద్వారా విస్తృత ప్రచారం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆమె కలెక్టర్లను విజ్ఞప్తి చేసారు.
సమావేశంలో పాల్గోన్న జిల్లా కలెక్టర్ జి .రవి మాట్లాడుతూ సమావేశంలో జారీ చేసిన సూచనలు, ఆదేశాలను నోట్ చేసుకున్నామని, వీటిని క్షేత్రస్థాయిలో అమలు చేస్తామని తెలిపారు. జిల్లాలో గత 6 వారాలుగా 13 బృందాలను ఏర్పాటు చేసి 113 గ్రామాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. లీగల్ సర్విస్ ఆథారటీ అందించే న్యాయ సేవల పై గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన కల్పిస్తామని తెలిపారు.
సమావేశంలో పాల్గోన్న ఎస్పీ సింధూ శర్మ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో నిర్వహించిన అవగాహన కార్యక్రమాలో పోలిస్ శాఖ ద్వారా కళాబృందం ఏర్పాటు చెసి భాగస్వామ్యం చేసామని తెలిపారు. బాధితులకు పరిహారం అందించే అంశంలో పోలిసులు నిర్వహించాల్సిన పాత్ర పై వివరించాలని కోరారు. దీనికి స్పంధించిన మెంబర్ సెక్రటరీ నవంబర్ 14 తరువాత బాధతులకు పరిహారం అందించే అంశంలో స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసిడ్యర్ తయారు చేసి పోలీసులకు, పబ్లిక్ ప్రొసిక్యూటర్లకు అందజేస్తామని తెలిపారు.
జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి , డి.పి.ఆర్.ఓ., జిల్లా పంచాయతి అధికారి , జిల్లా సంక్షేమ అధికారి , మున్సిపల్ కమిషనర్లు, లేబర్ ఆఫీసర్, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గోన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాలచే జారీ చేయనైనది

న్యాయ సేవల పై ప్రజల్లో అవగాహన కల్పించాలి :: రాష్ట్ర లీగల్ సర్వీస్ ఆథారటీ మెంబర్ సెక్రటరీ వై.రేణుక
న్యాయ సేవల పై ప్రజల్లో అవగాహన కల్పించాలి :: రాష్ట్ర లీగల్ సర్వీస్ ఆథారటీ మెంబర్ సెక్రటరీ వై.రేణుక

Share This Post