న్యాయ సేవాధికార సంస్థల ద్వారా బాధితులకు ఉచిత న్యాయ సేవలు…

ప్రచురణార్థం
మహబూబాబాద్ 02 నవంబర్2021.
*న్యాయ సేవాధికార సంస్థల ద్వారా బాధితులకు ఉచిత న్యాయ సేవలు అందించాలని చట్టాలపై ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ మెoబర్ యార రేణుక తెలిపారు*

మంగళవారం ఉదయం హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయం నుండి ఉమ్మడి వరంగల్ జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తియైన ఆర్థిక స్తోమత ఉన్న వారికే న్యాయం జరుగుతుందని, అవగాహన లేని పేద ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించాలనే సదుద్దేశంతో దేశంలోని సుమారు 6 లక్షల 70 వేల గ్రామాల్లో ఉచిత న్యాయ సహాయం, సేవలు అవగాహన సదస్సులను అక్టోబర్ 2 తేదీ నుండి నవంబర్ 14 వ తేదివరకు 43 రోజులపాటు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.

లీగల్ సర్వీస్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ప్రజల్లో చట్టాల పై సరైన అవగాహన లేదన్నారు. ఒక వ్యక్తి పై నేరము ఆరోపించిన అప్పుడు న్యాయవాదులను నియమించుకునే స్తోమత చదువులేని వారికి ఉచిత న్యాయం అందించడం, లోక్ అదాలత్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా తెలియ పరచడమైనది దీని ముఖ్య ఉద్దేశం అని అన్నారు. రాజ్యాంగ హక్కు ప్రకారం లీగల్ సర్వీసెస్ ద్వారా న్యాయ సేవలు ప్రతి మహిళకు, 3 లక్షలకు సంవత్సర ఆదాయం దిగువన ఉన్న వారికి ఈ సేవలు అందుబాటులో ఉంటాయని, వీలైనంత వరకు ప్రతి గ్రామంలో 2సార్లు లీగల్ సర్వీస్ సదస్సులను నిర్వహించాలని, బాధితులకు వీలైనంతవరకు న్యాయం జరిగేలా చూడాలని, సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలు అరాచకాలు ఎదురించే లా వారికి చట్టాల పై సరైన అవగాహన కల్పించి చైతన్యం చేయాలని, అన్యాయం జరిగిన తక్షణమే న్యాయసేవాధికార సంస్థ లకు ఫిర్యాదు చేయవచ్చునన్ని, మహిళల స్థితిగతులు బాగుపడాలని , దానికి చైతన్య విజ్ఞాన సదస్సులు నిర్వహించాలని, క్రిమినల్ కార్మిక గృహ హింస యాసిడ్ దాడి వరకట్న వేధింపులు పనిప్రదేశాల్లో లైంగిక వేధింపులు ప్రస్తుతి ప్రయోజనాల చట్టం సమాన పనికి సమాన వేతనం మొదలైన మహిళా చట్టాలకు ఆటంకం కలిగితే జిల్లా న్యాయ సేవా సంస్థలను నేరుగా కానీ వరంగల్ న్యాయ సేవ సాధికార సంస్థ ద్వారా గాని రక్షణ పొందవచ్చునని తెలిపారు. న్యాయం దృష్టిలో అందరూ సమానులే అని న్యాయానికి గొప్ప బీద అనే తేడా లేదని ఆర్థిక కారణాలతో న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకూడదని, అధికరణ 39-ఎ బీద బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా నిర్దేశించారన్నారు.

ఉచితంగా న్యాయ సహాయం పొందడానికి ఎస్సీ ఎస్టీలు మానవ అక్రమ రవాణా బాధితులు స్త్రీలు పిల్లలు మతిస్థిమితం లేనివారు అవిటి వారు పారిశ్రామిక కార్మికులు, మొదలైనవారు న్యాయసేవలకు అర్హులని తెలిపారు.

డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మహబూబాద్ నుండి జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి, ఆర్ డి ఓ రమేష్ బాబు లు మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ న్యాయ సేవలు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను సంక్షేమ పథకాల మాదిరిగా అవగాహన కార్యక్రమాలు వివిధ శాఖల నుండి కార్యక్రమాలను ఏర్పాటు చేసి బాధితులకు సరైన న్యాయం జరిగేట్లు, అవగాహన చైతన్య కార్యక్రమాలను ఇప్పటికే నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో హనుమకొండ కలెక్టరేట్ నుండి… లీగల్ అడ్వైజర్ కమిటీ సెక్రెటరీ జి వి మహేష్ నాథ్. జిల్లా జడ్జి నరసింహారావు. వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కమిషనర్లు పాల్గొనగా
*మహబూబాబాద్ నుండి అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతమ్, డి ఆర్ డి ఓ సన్యాసయ్య ,dm&ho హరీష్ రాజ్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాసరావు, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి రామకృష్ణ, సివిల్ సప్లై అధికారి నర్సింగరావు, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ బుచ్చయ్య, Rdo కార్యాలయ డి ఏ ఓ రాంప్రసాద్, డి సి ఓ కుర్చీద్, ఓ ఎస్ సి అనురాధ, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి ఉచిత న్యాయ సలహా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు*.
——————————-

*జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కార్యాలయం మహబూబాబాద్ గారిచే జారీ చేయడమైనది*

Share This Post