న్యాయ సేవ సదన్ భవన్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ఎంజీ ప్రియదర్శిని.

 

పత్రికా ప్రకటన తేదీ: 3-12-2021
కరీంనగర్

ఈనెల 11వ తేదీన జాతీయ లోక్ అదాలత్

రాజీ పడదగిన కేసులు అన్నిటికీ పరిష్కారం

కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా సెషన్స్ జడ్జి ఎం.జి. ప్రియదర్శిని
00000

జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఢిల్లీ మరియు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ హైదరాబాద్ ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కరీంనగర్ ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కరీంనగర్ చైర్ పర్సన్ ఎం జి ప్రియదర్శిని తెలిపారు.

శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణలో ని న్యాయ సేవా సదన్ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టులలో ఈనెల 11వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తామని తెలిపారు. పెండింగ్లో ఉన్న 3500 కేసుల పరిష్కారానికి వీలుంటుందని జడ్జి తెలిపారు. కాగా సుమారు ఐదు వేల (5000) కేసుల వరకూ లోక్ అదాలత్ కు వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రాజి పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ దావా లు, కుటుంబ తగాదాలు, మోటారు వాహనాల చట్టం కు సంబంధించిన కేసులు, బ్యాంకు కేసులు, చిట్ ఫండ్ కేసులు ఇతరత్రా కేసులను ఇరుపక్షాల సమ్మతితో పరిష్కారం చేయబడునని జిల్లా జడ్జి తెలిపారు. కక్షిదారులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ సంఖ్యలో కేసుల పరిష్కారం కోసం పోలీస్, రెవెన్యూ, ఇన్సూరెన్స్ అధికారులు, ప్యానల్ న్యాయవాదులతో సమీక్షలు నిర్వహించామని జిల్లా జడ్జి తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సుజయ్, జిల్లా బార్ అసోసియేషన్ కార్యదర్శి జూపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కార్యాలయం కరీంనగర్ వారిచే జారీ చేయడమైనది.

Share This Post