న్యుమోనియా రాకుండా ఆరు వారాలు దాటిన ప్రతి చిన్నారికి పి.సి.వి. టీకా ఇప్పించవలసిందిగా జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్

న్యుమోనియా రాకుండా ఆరు వారాలు దాటిన ప్రతి చిన్నారికి  పి.సి.వి. టీకా ఇప్పించవలసిందిగా జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్

న్యుమోనియా రాకుండా ఆరు వారాలు దాటిన ప్రతి చిన్నారికి పి.సి.వి. టీకా ఇప్పించవలసిందిగా జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో వైద్యాధికారులతో ఏర్పాటు చేసిన జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశంలో మాట్లాడుతూ న్యుమోఫోకస్ బ్యాక్టీరియా ద్వారా వచ్చే న్యుమోనియా నుండి చిన్నారులను రక్షించుటకు ఈ నెల 12 నుండి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పి.వి.సి. టీకాలు ఇవ్వనున్నామని అన్నారు. పుట్టిన ప్రతి చిన్నారి ఆరోగ్యవంతంగా ఎదగాలనే ఉద్దేశ్యంతో ఇప్పటి వరకు ఆరు రకాల టీకాలు ఇస్తున్నామని, ఇది 7వ టీకా అని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా న్యుమోనియా బారిన పడుతున్న వారి సంఖ్య 15 శాతం ఉందని, ఇది మనిషిలో రోగనిరోధక శక్తి సన్నగిల్లినప్పుడు వస్తుందని, ప్రాణ హాని జరగకుండా, ముందస్తుగా చిన్నారులకు న్యుమోనియా రాకుండా పి.సి.వి. టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. జిల్లాలో ఆరు వారాల పైబడిన వారు 8,394 ఉన్నట్లు గుర్తించామని ఈ చిన్నారులందరికి టీకా ఇప్పించుటలు, పంచాయత్ కార్యదర్శులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ టీకా సంవత్సరం లోపు మూడు విడతలుగా ఇవ్వబడుతుందని, ప్రైవేట్ గా వెలితే ఒక్కో డోసు 6 వేల రూపాయలకు పైగా ఉంటుందని, కానీ ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నందున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పిల్లలకు టీకాలు ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ నెల 12 నుండి వచ్చే నెల 12 వరకు వైద్య శాఖ వారు టీకాలు ఇస్తారని, ఇందులో టీకాలు తీసుకోకుండా మిగిలిపోయిన వారిని గుర్తించి అందరికి ఇప్పించేలా చూడాలని వైద్య అనుబంధ శాఖల అధికారులు, సి.డి.పి.ఓ.ల కు సూచించారు. అదేవిధంగా చిన్నారులకు క్యాలెండర్ ప్రకారం ఇస్తున్న ఆరు రకాల టీకాలు ఇప్పించుటలో డ్రాప్ అవుట్ కనిపిస్తున్నాయని, అలా జరగకుండా తల్లిదండ్రులలో అవగాహన కలిగించాలన్నారు. 5 సంవత్సరాల లోపు బలహీనంగా ఉన్న పిల్లలకు పోలియో వచ్చే అవకాశాలుంటాయని, అట్టి వారిని గుర్తించి స్టూల్ శాంపుల్ రక్త నమూనా సేకరించాలన్నరు. మూడవ విడత జ్వర సర్వే చేపట్టి కరోనా లక్షణాలున్న వారికి వైద్య కిట్టు అందించవలసినదిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సూచించారు. ఇటీవల తూప్రాన్ లోని 15 వార్డులో ముగ్గురికి డెంగ్యు వచ్చిందని, పరిసరాలను శుభ్రంగా ఉండేలా, దోమలు లేకుండా చూడాలని అన్నారు. అనంతరం ఏ.యెన్.ఏం. లకు ట్యాబ్ లు పంపిణి చేశారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, జిల్లా పరిషద్ సి.ఈ.ఓ. శైలేష్, డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, డి.పి .ఓ. తరుణ్ కుమార్, డి.ఈ.ఓ. రమేష్ కుమార్, అదనపు డి.ఏం. అండ్ హెచ్.ఓ.లు, సుమిత్ర, మాధురి, నవీన్ కుమార్, విజయ నిర్మల, అరుణ శ్రీ, చంద్రశేఖర్, మాస్ మీడియా అధికారి పాండురంగా చారి, మలేరియా అధికారి తదితరులు పాల్గొన్నారు.

Share This Post