న్యూట్రి గార్డెన్ల పెంపకం విరివిగా చేపట్టాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

జిల్లాలో పిల్లలకు, గర్భిణులకు పోషకాహారం అందించే ఉద్దేశంతో చేపట్టిన న్యూట్రి గార్డెన్ ల పెంపకం విరివిగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. పోషణ మాసం కార్యక్రమం లో భాగంగా 9వ రోజు గురువారం మండలంలోని ఆర్ ఆర్ కాలనీ లో న్యూట్రి గార్డెన్ల పెంపక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ జిల్లాలో పోషకాహారలోపం తొలగించడానికి జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల ఆవరణలో ప్రాథమిక పాఠశాలల ఆవరణలో న్యూట్రి గార్డెన్ల పెంచడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా వాటి పెంపకంపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దీనిద్వారా చిరుధాన్యాలు పండించడమే కాకుండా తాజా వాటితో పోషకాలు ఎక్కువ లభించే అవకాశం ఉంటుందని, ఇప్పటికే చిరుధాన్యాల కు సంబంధించి పౌడర్ తయారీ కేంద్రాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న అవసరాల నిమిత్తం పూర్వ ప్రాథమిక పాఠశాలలో డిజిటలైజేషన్ ప్రక్రియ చేపట్టడానికి నిర్ణయించామని, డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా ప్రతి మండలంలో 3 అంగన్వాడీ కేంద్రాలను డిజిటలైజేషన్ చేయడానికి నిర్ణయించామని అన్నారు. దీనిలో భాగంగా ఆయా అంగన్వాడీ కేంద్రాలకు ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు స్మార్ట్ టీవీ అందజేయడం జరుగుతుందన్నారు. దీని ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని సావిత్రి ఎంపీపీ మల్లికార్జున్, సిడిపిఓ సాదియా,డి ఎల్ పి ఓ రమేష్, ఎంపీవో ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి రాజాబాబు పాల్గొన్నారు అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిచే జారీ చేయబడినది

Share This Post