న్యూమొకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ జిల్లా వైద్యాధికారులు సమావేశం, జాతీయ పొగాకు ఉత్పత్తుల నియంత్రణ సమావేశం : జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన                          తేది:9 8 2021
వనపర్తి

1 సంవత్సర లోపు మరణాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు పి సి వి వ్యాక్సిన్ త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష తెలిపారు.
సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా వైద్యాధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1నుండి 2 సంవత్సరాల లోపు పిల్లలు న్యుమోనియా వ్యాధితో మరణిస్తున్నారని తెలిపారు. దీనిని అరికట్టేందుకు త్వరలో పిసిబి (న్యూమొకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్) ప్రవేశ పెడుతున్నారని దీనివల్ల శిశుమ రణాలు అరికట్టవచ్చని అన్నారు. ముఖ్యంగా పిల్లలకు తల్లిపాలు ఇవ్వాలని దాని వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. ఇప్పటికే 146 దేశాలలో pcv వ్యాక్సిన్ వేస్తున్నారని మన దేశంలో కూడా త్వరలో ఈ వ్యాక్సిన్ రానుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి ఎం హెచ్ వో చందు నాయక్, డాక్టర్ సౌభాగ్య లక్ష్మి ,డాక్టర్ సౌమ్య, డాక్టర్ శ్యామ్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రవి శంకర్, డాక్టర్ రామ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం పొగాకు ఉత్పత్తుల నియంత్రణ కార్యక్రమంలో అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష అన్నారు.
సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జాతీయ పొగాకు ఉత్పత్తుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొగాకు వాడటం వల్ల క్యాన్సర్, కంటి చూపు తదితర సమస్యలు ఏర్పడతాయని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం శిక్ష 6 ప్రకారం 18 ఏళ్ల లోపు వారికి పొగాకు ఉత్పత్తులను విక్రయించి రాదని అలా విక్రయించిన వారికి రూ 200 జరిమానా విధించాలని అన్నారు. సెక్షన్ 4 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం సరి కాదని అలా నిర్వహిస్తే రూ. 300 జరిమానా విధించాలని అన్నారు. సెక్షన్ 5 ప్రకారం పొగాకు ఉత్పత్తులను ప్రచారం చేస్తే వేయి రూపాయలు జరిమానా ఉంటుందని అన్నారు. సెక్షన్ 6ఏ ఏ ప్రకారం విద్యాలయాలకు సమీపంలో పొగాకు ఉత్పత్తులు విక్రయించ రాదని, వందగజాల దూరంలో విక్రయించాలని తెలిపారు దీనిని అతిక్రమిస్తే జరిమానాతో పాటు శిక్ష ఉంటుందని అన్నారు. సెక్షన్ 7, 8, 9, 10 ప్రకారం పొగాకు ఉత్పత్తులపై తనకు హెచ్చరికలు ఉండాలని ఆదేశించారు లేనిపక్షంలో శిక్ష తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ డీఎంహెచ్ఓ చందు నాయక్, డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, డాక్టర్ సౌమ్య, డాక్టర్ శ్యామ్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రవి శంకర్, డాక్టర్ రామ్ చందర్, డి డబ్ల్యూ ఓ ఓ పుష్పలత, డిటిఓ జాకీర్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, డిఆర్డిఓ నరసింహులు, డిపిఓ సురేష్, డి పి ఆర్ ఓ రషీద్ తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి నుండి జారి చేయనైనది.

 

Share This Post