న్యూమోకోకల్ వ్యాక్సినేషన్ పై ప్రజలకు అవగాహన కల్పించండి :: జిల్లా కలెక్టర్ జి. రవి

న్యూమోకోకల్ వ్యాక్సినేషన్ పై ప్రజలకు అవగాహన కల్పించండి :: జిల్లా కలెక్టర్ జి. రవి

ప్రచురణార్థం—-1                                                                                                                                                                                                                                                  తేదిః 09-08-2021

న్యూమోకోకల్ వ్యాక్సినేషన్ పై ప్రజలకు అవగాహన కల్పించండి :: జిల్లా కలెక్టర్ జి. రవి

     జగిత్యాల, అగస్టు 09: జిల్లాలోని 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలో సంక్రమించే న్యూమోకోకల్ వ్యాదికి అందించే వ్యాక్సినేషన్ పై పిల్లల తల్లితండ్రులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. సోమవారం స్థానిక ఐఎంఏ హాలులో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, వ్యాక్సిన్ అగస్టు, 2021 మాసంలో తెలంగాణాలో ప్రవేశపెట్టడం జరిగిందని, తల్లిపాలివ్వక పోవడం, రోగ నిరోధక శక్తిలేని పిల్లలు, రద్దీప్రదేశాలు, హెచ్.ఐ.వి సంక్రమణ, సికల్ సెల్ వ్యాది, మూత్రపిండ వ్యాదిగ్రస్తుల్లో వ్యాది సంక్రమించే అవకాశాలు ఏక్కువగా ఉంటాయని అన్నారు.

సంవత్సరంలోపు వయసు ఉన్న చిన్న పిల్లను గుర్తించిమొదటి, రెండవ మరియు మూడవ డోస్ లను ప్రతి బుదవారం మరియు శనివారాలలో సబ్ సెంటర్, పిహెచ్సి, మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో అందజెయడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆశా, అంగన్ వాడి లద్వారా ఎప్రిల్ మాసం నుండి పుట్టిన పిల్లల నివేదికను తయారు చేసుకోని, వారు ఏ వ్యాక్సిన్ కేంద్రానికి పంపించాలని అనే నివేధికను సిద్దం చేసుకోని వారికి సకాలంలో వ్యాక్సిన్ అందజేయడానికి చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు. ఈ టీకాను 3దశల్లో 0.5 మి.లీ. చొప్పున శిశువు పుట్టిన 6 వారాలకు తొలిడోసు, 14 వారాలకు రెండవ డోసు ఇవ్వాల్సి ఉంటుందని, చివరగా బూస్టర్‌ డోసును శిశువు పుట్టిన 9 నెలలకు లేదా ఏడాదిలోపు తప్పనిసరిగా అందజేయాలని సూచించారు. నెలలు నిండని శిశువుకు 6 వారాల వయస్సులో లేదా 6 వారాలు నిండిన తరువాత నెలలు నిండని పిల్లవాడికి 1 ½ నెలలో (6వారాలు) లేదా 1 ½ (6వారాలు) వయసస్సు తర్వాత కానీ సాద్యమైనంత త్వరగా టీకాలు వేయడం మొదలు పెట్టాలని సూచించారు. వ్యాక్సిన్ వలన జలుబు, వ్యాక్సిన్ వేసిన చోట నోప్పి, జ్వరం వంటివి సంబవిస్తాయని ప్రజలు ఆందోళన చేందకుండా వారికి అవగాహనను కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి జె. అరుణశ్రీ, జగిత్యాల అర్డిఓ శ్రీమతి ఆర్.డి. మాదురి, డిప్యూటి డియంహచేఓ జయపాల్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గోన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారి చేయనైనది.

న్యూమోకోకల్ వ్యాక్సినేషన్ పై ప్రజలకు అవగాహన కల్పించండి :: జిల్లా కలెక్టర్ జి. రవి

Share This Post