న్యూమోనియా వ్యాధి సోకకుండా P.C.V. వ్యాక్సిన్ ద్వారా రక్షణ పొందాలి — జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ప్రచురణార్ధం

మహబూబాబాద్, ఆగస్ట్-09:

జిల్లా అధికారులందరూ P.C.V. వ్యాక్సిన్ పై అవగాహన కలిగి 5 సంవత్సరాల లోపు పిల్లలకు న్యుమోనియా వ్యాధి సోకకుండా వ్యాక్సిన్ వేసె విధంగా తమ శాఖ తరపున ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు.  ఆగస్ట్-12న పి.సి.వి. వ్యాక్సిన్ ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పెట్టనుందని అన్నారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా హాజరైన జిల్లా అధికారులకు P.C.V. వ్యాక్సిన్ గురించి జిల్లా కలెక్టర్ వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ హరీష్ రాజ్ జిల్లా అధికారులకు P.C.V. వ్యాక్సిన్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన  కల్పించి, 5 సంవత్సరాల లోపు పిల్లలకు న్యుమోనియా వ్యాధి సోకకుండా పి.సి.వి. వ్యాక్సిన్ రక్షిస్తుందని, మొత్తం 3 డోసులు వేసే ఈ వ్యాక్సిన్ ను మొదటి డోసు 6 వారాల శిశువులకు (ఒకటిన్నర నెలలకు), రెండవ డోసు 14 వారాలు ( మూడున్నర నెలలకు), మూడవ డోసు 9 నెలలకు ఇవ్వనున్నట్లు తెలిపారు.  తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పకుండా ఈ వ్యాక్సిన్ వేయించి న్యూమోనియా వ్యాధి బారిన పడకుండా రక్షించుకోవాలని కోరారు.  

ఈ సమావేశంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలనాధికారి, తదితరులు పాల్గొన్నారు.
———————————————————————————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి, మహబూబాబాద్ కార్యాలయంచే జారీచేయనైనది.

Share This Post