ఆన్ లైన్ ర్యాండమైజెషన్ పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్, పాల్గొన్న సాధారణ పరిశీలకులు

ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ సిబ్బంది ఎంపిక

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్

పాల్గొన్న కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకుడు ముత్తు కృష్ణన్ శంకర్ నారాయణ
00000

31- హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక ఈనెల 30న జరగనున్న సందర్భంగా పోలింగ్ సిబ్బంది ని రాండమైజేషన్ ద్వారా ఎంపిక చేశారు. గురువారం హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో కార్యాలయంలో 3వ ర్యాన్డమైజేషన్ ను కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకుడు ముత్తు కృష్ణన్ శంకర్ నారాయణ సమక్షంలో నిర్వహించారు. నియోజకవర్గంలోని 306 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించే 306 ప్రిసైడింగ్ అధికారులు, 306 అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 612 మంది ఓ పి ఓ లను రాండ మైజేషన్ ద్వారా ఎంపిక చేసామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు. 40 శాతం మంది పోలింగ్ సిబ్బంది ని రిజర్వెలో ఉంచామని అన్నారు. ఈనెల 29న శుక్రవారం ఉదయం 9 గంటలకు హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ సిబ్బంది రిపోర్టు చేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరము పోలింగ్ విధులు నిర్వర్తించనున్న మైక్రో అబ్జర్వర్ లను రాండ మైజేషన్ ద్వారా ఎంపిక చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు మైక్రో అబ్జర్వర్లు రిపోర్ట్ చేయాలని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, నొడలు అధికారి శ్రీధర్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

Share This Post