పంచాయతీ అధికారులు నిబద్ధతతో పని చేయాలి…

ప్రచురణార్థం

పంచాయతీ అధికారులు నిబద్ధతతో పని చేయాలి…

మహబూబాబాద్ నవంబర్ 16.

పంచాయతీ అధికారులు నిబద్ధతతో పనిచేయాలని అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ పనులపై అదనపు కలెక్టర్ సమీక్షించారు.

విద్యుత్ బిల్లుల వసూళ్లలో జాప్యం తగదు అని గతంలో చెల్లించాల్సిన నగదును కూడా వసూలు చేయాలని అన్నారు. బిల్లులు పెండింగ్ పెడితే చర్యలు తీసుకుంటామన్నారు

గ్రామపంచాయతీ ట్రాక్టర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించాలి అన్నారు అదేవిధంగా వాహనాలు నడిపే డ్రైవర్లకు కూడా లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.

పల్లె ప్రకృతి వనాలు, సెగ్రి గేషన్ షడ్స్, స్మశాన వాటికలు నిర్వహణ సక్రమంగా జరిగే విధంగా పనులు చేపట్టాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి సాయి బాబా, ఎంపీవోలు తదితరులు పాల్గొన్నారు.
——————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post