పంటలకు పుట్టినిల్లు వరంగల్ అని…పారిశ్రామిక రంగం లో అత్యాధునిక విధానాలను ఉపయోగించి జిల్లా లో ఎగుమతులను పెంపోదించే దిశగా కృషి చేయాలనీ అధికారులను, పారిశ్రామిక వేత్తలను తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ముఖ్య సలహాదారు శ్రీ బీపీ ఆచార్య ఐఏఎస్ సూచించారు

ప్రచురునార్ధం

వరంగల్
పంటలకు పుట్టినిల్లు వరంగల్ అని…పారిశ్రామిక రంగం లో అత్యాధునిక విధానాలను ఉపయోగించి జిల్లా లో ఎగుమతులను పెంపోదించే దిశగా కృషి చేయాలనీ అధికారులను, పారిశ్రామిక వేత్తలను తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ముఖ్య సలహాదారు శ్రీ బీపీ ఆచార్య ఐఏఎస్ సూచించారు

మంగళవారం కలెక్టరేట్ లో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ముఖ్య సలహాదారు అధ్యక్షతన వ్యాపార, వాణిజ్య రంగం సాధికారికత మీద పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య, వ్యాపార వర్గాల తో సమావేశం జరిగింది

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ జిల్లా లో ప్రధానం గా పండించే కాటన్, మిరప ఉత్పత్తుల నాణ్యత ని పెంచి తద్వారా ఎగుమతులను పెంపోదించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు

జిల్లా లో ఉన్నా ITI, ఇతర సాంకేతిక విద్య సంస్థల విద్యార్థులకు పారిశ్రామిక రంగం లో కావలిసిన శిక్షణ ను ఇప్పించి వారి కి త్వరగా ఉపాధి లభించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు

ఇండో జర్మన్ టెక్నీకల్ ఎడ్యుకేషన్ ద్వారా విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఉన్న అవకాశాలను వివరించారు

జిల్లా లో పారిశ్రామిక ఉత్పత్తులను అమెజాన్ ద్వారా అమ్మేందుకు జులై, ఆగష్టు లో నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వ్యాపార, వాణిజ్య వర్గాలకి , సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలన్నారు

జనోమ్ వ్యాలీ ఉత్పత్తి చేసే సేంద్రియ ఎరువుల ద్వారా కాటన్, మిర్చి దిగుబడి విస్తృతం గా పెంచవచ్చని సూచించారు

కాలనుగుణంగా వస్తున్నా వివిధ మార్పులకు అనుగుణంగా వ్యాపార, పారిశ్రామిక వేత్తలు, అధికారులు ఎప్పటికప్పుడు పారిశ్రామిక రంగం లో వినూత్న మార్పులు తీసుకరావలిసిన అవసరం ఉందని, దానితో పాటు
పంటలు పండించే విధానం లో రైతుల కు అవగాహన కార్యక్రమలను ఏర్పాటు చేయాలనీ
తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ముఖ్య సలహాదారు బీపీ ఆచార్య ఐఏఎస్ తెలిపారు
ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ లు హరి సింగ్, శ్రీ వాత్స, ఛాంబర్ అఫ్ కామర్స్ రవీందర్ రెడ్డి, సెక్రటరీ మడూరి వేద ప్రకాష్,
పారిశ్రామిక శాఖ జనరల్ మేనేజర్ నర్సింహా మూర్తి, pd drdo,
రైస్ మిలర్స్ కాటన్, చిల్లి ఇండస్ట్రీ లకు సంబందించిన వ్యాపార వేత్తలు, వివిధ శాఖ లకు సంబందించిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు

Share This Post