పంటల నమోదు ఆగస్టు 25 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ఎ. శరత్ ఆదేశించారు.

ప్రెస్ రిలీజ్. తేది13.08.2021

పంటల నమోదు ఆగస్టు 25 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ఎ. శరత్ ఆదేశించారు.

శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లో వ్యవసాయ, ఆరోగ్యశాఖ, పల్లె ప్రగతి పై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులతో మాట్లాడారు. వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులను అడిగి పంటల వివరాలు నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో 35 వేల మంది రైతులకు కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చాయని చెప్పారు. రైతు బీమా కోసం అర్హతగల రైతులందరూ దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. 18 నుంచి 59 ఏళ్ళ లోపు వయసు గలవారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, నామిని ఆధార్ కార్డు తో పాటు దరఖాస్తు చేయవలసి ఉంటుందని చెప్పారు. క్లస్టర్ ఎఈ ఓ లు రైతు బీమా పోర్టల్ లో పేర్లు ఉన్న రైతులకు తప్పనిసరిగా భీమా చేయించాలని పేర్కొన్నారు. రసాయనిక ఎరువులు ప్రతి రైతుకు అందే విధంగా వ్యవసాయ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. వారంలో రెండు రోజులపాటు రైతు వేదికలో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాలని వ్యవసాయ విస్తీర్ణ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలలో ఖాళీ స్థలాలు ఉంటే ఈనెల 15లోగా మొక్కలు నాటాలని సూచించారు. టేకు, మహాఘాని, మామిడి, జామ, నిమ్మ, బొప్పాయి, దానిమ్మ వంటి మొక్కలు నాటాలని కోరారు. మలేరియా,డెంగి, కోవిడ్ కేసులు లేకుండా వైద్య సిబ్బంది చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో పైప్ లైన్ లీకేజీ లు, అపరిశుభ్రత వాతావరణం లేకుండా చూడాలన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింట సర్వే చేపట్టాలని పేర్కొన్నారు. అర్హతగల వారికి కరోనా టీకాలు వేయాలని సూచించారు. జిల్లాలో 35000 డోసుల వ్యాక్సిన్ అందుబాటులో ఉందని చెప్పారు. లేబర్ టర్నోవర్ ప్రతి గ్రామపంచాయతీలో 100 మంది కూలీలు పనిచేసే విధంగా చూడాలన్నారు. అసంపూర్తిగా ఉన్న స్మశాన వాటిక ల ను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కంపోస్ట్ షెడ్లు వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలలో మొక్కలు నాటడానికి అవగాహన శిబిరం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్న చోట రెండవ బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసుకోవాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్ లోజిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, కలెక్టరేట్ ఏవో రవీందర్, డి పి ఓ సునంద, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ట్రాన్స్కో ఈఈ శేషారావు, ఉపాధి హామీ ఏపీ డిలు సాయన్న, శ్రీకాంత్, అధికారులు పాల్గొన్నారు. Dpro..Kamareddy.

Share This Post