పంటల సాగుతో పాటు ప్రాసెసింగ్ పై దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

పంటల సాగుతో పాటు ప్రాసెసింగ్ పై దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
——————————-

జిల్లాలోనీ చేసిన మండలాలలో వైవిద్య పంటల సాగును ప్రోత్సహించడంతోపాటు పంటలను ప్రాసెసింగ్ చేసే విధానాలపై రైతులు దృష్టి పెట్టేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.

ప్రభుత్వ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ లో భాగంగా జిల్లాలోని కోనారావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ ,సిరిసిల్ల మండలాలలో నాలుగు రైతు ఉత్పత్తిదారుల సంఘాలను (FPO) ఎంపిక చేయటం జరిగింది.
బుధవారం రాత్రి కలెక్టరేట్ లో నిర్వహించిన ఈ మండలాలకు సమావేశంలో ఆమోదం తెలిపారు.
ఎంపిక చేసిన మండలాల్లోని
ఈ ఎఫ్ పి ఓ లను SFAC ప్రమోట్ చేయడం జరుగుతుంది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ…. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు భూమి రకాలు, మార్కెటింగ్ సౌకర్యం ఆధారంగా ఏ పంటలు సాగు చేస్తే లాభదాయకంమో వచ్చే సమావేశంలో నిర్ణయించాలని అన్నారు.

సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, జెడ్పీ సీఈవో గౌతమ్ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కొమురయ్య, జిల్లా సహకార అధికారి బుద్ధ నాయుడు ,జిల్లా మత్స్యశాఖ అధికారి జి శివప్రసాద్, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ కి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

 

అంతకుముందు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పంచాయితీ రాజ్ వ్యవస్థ ద్వారా అమలువు తున్నకార్యకలాపాల పై కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపిడివో లు, mpo లు, సెక్రెటరీ లతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండేలా చూడాలన్నారు.

తెలంగాణ క్రీడా ప్రాంగణాలు స్థలం గుర్తించి ఉన్న వాటిని వచ్చే రివ్యూ లోగా గ్రౌండింగ్ చేయాలన్నారు.
గురువారం సాయంత్రం లోగా దళితబంధు లబ్దిదారుల యూనిట్లు గ్రౌండింగ్ చేయాలన్నారు.
హరితహారంలో భాగంగా ఎక్కడైనా మొక్కలు లేకుండా ఉంటే వెంటనే మొక్కలు నాటించాలన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, dpo రవీందర్ తదితరులు పాల్గొన్నారు
——————————–

 

Share This Post